అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్లో ఉండే వాళ్లంతా కచ్చితంగా శస్త్ర చికిత్స చేయించుకొని తమ అపెండిక్స్(ఉండుకం)ను తొలగించుకోవాలి. లేకపోతే అక్కడ బతకడం కష్టం.
ఆ ఊరి పేరు విల్లాస్ లాస్ ఎస్ట్రెలాస్. అంటార్కిటికాలో ప్రజలు నివాసం ఉంటోన్న ప్రదేశాల్లో అదీ ఒకటి. స్థానికులకు తోడు శాస్త్రవేత్తలు, చిలీ సైనికులు అక్కడికి నిత్యం వచ్చి వెళ్తుంటారు. కొందరు సైనికులు కుటుంబాలతో సహా అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు.
ఆ ఊళ్లో ఒక పోస్టాఫీసు, స్కూల్, చర్చి, జనరల్ స్టోర్, బ్యాంకుతో పాటు మరికొన్ని మౌలిక వసతులు ఉన్నాయి. కానీ దానికి దరిదాపుల్లో ఎక్కడా ఒక్క ఆస్పత్రి కూడా లేదు. ఊళ్లో కొందరు వైద్యులు ఉన్నా, వాళ్లెవరికీ శస్త్ర చికిత్సలో నైపుణ్యం లేదు.
అంటార్కిటికాలోని పెద్దాస్పత్రి ఆ గ్రామానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచుతో నిండిన దారుల గుండా అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే అందించడం సాధ్యం కాదు. అదే 24 గంటల కడుపునొప్పి(అపెండిసైటిస్) తలెత్తితే అది ప్రాణాంతకంగా మారొచ్చని స్థానికులు భావించారు. అందుకే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారంతా కచ్చితంగా ముందుగానే శస్త్రచికిత్స చేయించుకొని తమ ఉండుకాన్ని తొలగించుకోవాలని నియమం పెట్టుకున్నారు.
లాస్ ఎస్ట్రెలాస్ గ్రామంలో సగటు ఉష్ణోగ్రత -2.3డిగ్రీలు. చలికాలంలో అది ఏకంగా -47డిగ్రీల వరకు పడిపోతుంది.
లాస్ ఎస్ట్రెలాస్ గ్రామంలో సగటు ఉష్ణోగ్రత -2.3డిగ్రీలు. చలికాలంలో అది ఏకంగా -47డిగ్రీల వరకు పడిపోతుంది.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టం. సాధ్యమైనంతవరకు అలాంటి పరిస్థితులను నివారించేందుకే వాళ్లు ప్రయత్నిస్తారు. సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా ఆ గ్రామంలో ఉండే సమయంలో మహిళలు గర్భవతులు కాకపోవడమే మంచిదని చిలీ సైన్యాధికారులు సూచిస్తారు.
చిలీకి చెందిన వైమానిక దళం ఆ గ్రామంలో నిత్యం పహారా కాస్తుంది. సాధారణ వాహనాలు అక్కడి మంచులో ప్రయాణించలేవు. ఒక్కోసారి వాహనాలు మంచులో కూరుకొని కనిపించకుండాపోయే ప్రమాదమూ ఉంది. అందుకే జీపీఎస్ ఉన్న వాహనాలను, 4డబ్ల్యుడీ ట్రక్కులను మాత్రమే అక్కడ వినియోగిస్తారు.

సి-130 మోడల్ విమానాలే ఆ గ్రామానికి చేరుకునేందుకు అనువైనవి. అమెరికాకు చెందిన లాకీడ్ మార్టిన్ కంపెనీ వాటిని తయారు చేస్తోంది. ఆ గ్రామంలోని అన్ని అవసరాలకూ కావల్సిన సామగ్రి ఆ భారీ విమానం ద్వారానే చేరుతుంది. కానీ వాటి ప్రొపెల్లర్ల శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విమానాల్లో ప్రయాణించినంత సేపూ ఇయర్ ప్లగ్స్‌ను ధరించాల్సిందే.
వేరే గ్రహం మీద జీవితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ ఊరికి వెళ్లి రావల్సిందేనని కొందరు సాహస యాత్రికులు చెబుతారు.
వేరే గ్రహం మీద జీవితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ ఊరికి వెళ్లి రావల్సిందేనని కొందరు సాహస యాత్రికులు చెబుతారు.
ఆ గ్రామంలో పెంగ్విన్లు మనుషుల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్వేచ్ఛగా ఇళ్ల మధ్యే తిరుగుతూ కనిపిస్తాయి.
జీవనశైలి కఠినంగా ఉన్నప్పటికీ, ఆ సాహసోపేతమైన జీవితంలోనూ ఓ థ్రిల్ ఉందని, అతికొద్ది మందికి మాత్రమే ఆ అనుభవం లభిస్తుందని స్థానికులు చెబుతారు. కాకపోతే ఆపరేషన్ చేయించుకోవడమే కాస్త ఇబ్బంది అంటారు.
Post A Comment:
0 comments: