'రూ. 2 వేల నోట్లను త్వరలోనే బ్యాన్ చేస్తారు..' గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట ఇదీ. అయితే, అలాంటిదేమీ లేదని ఇటు ఆర్బీఐ.. ఆటు కేంద్ర ఆర్థిక శాఖ చెబుతూ వస్తున్నాయి. కానీ, తెర వెనుక మాత్రం ఈ పెద్ద నోటుకు స్వస్తి పలికేందుకు కేంద్రం, ఆర్బీఐ చర్యలు చేపట్టాయా? త్వరలోనే ఈ నోటుకు మంగళం పాడబోతోందా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఇంత కచ్చితంగా ఎలా చెప్పడానికి కారణం ఏంటంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బీఐ ప్రింట్ చేయకపోవడమే. వాస్తవానికి, 2016 నవంబరులో పెద్ద నోట్లుగా చలామణి అయిన రూ.500, రూ.1000 నోట్లను తక్షణ రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా రూ.2 వేల నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది.
అయితే, అది కూడా కొద్దికాలమే ఉంటుందని అప్పట్లోనే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే.. రూ. 2 వేల నోటును రద్దు చేయబోమని స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ.. ఏటికేడు రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చింది ఆర్బీఐ.
2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. అదే.. ఈ ఏడాది మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది.రూ. 2వేల దొంగ నోట్లను ప్రింట్ చేసే కుట్రలు ప్రారంభమయ్యాయని, దాని వెనుక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న తరుణంలో నోట్ల ముద్రణ ఆపేయడం గమనార్హం. గత జూన్‌లో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం.. గత మూడేళ్లలో రూ.50 కోట్ల నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Post A Comment:
0 comments: