రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్, నాన్ గెజిటెడ్ పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేశామని.. పాలనాపరమైన కారణాల వల్లే ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చినట్టు కార్యదర్శి వివరించారు. ప్రస్తుతం వాయిదా పడిన పరీక్షలను నిర్వహించే తేదీలను ఈనెల 22న వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తమ ప్రకటనలో పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: