కొత్త పాలకవర్గం ఏర్పడిన తరువాత తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఇతర సౌకర్యాలకు బ్రేక్ పడింది. అయితే, భక్తులకు బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు మరో కొత్త విధానానికి తెరతీసేందుకు టీటీడీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.10 వేలు విరాళమిచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టీటీడీకే చెందిన శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేల విరాళం ఇస్తే ఒక బ్రేక్ దర్శనం టికెట్‌ను ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా చర్చలు పూర్తి చేసిన టీటీడీ… అందుకు తగ్గట్టు సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే పనిలో ఉంది. మరో నాలుగు వారాల్లో ఈ విధానం అమలులోకి రానుంది.

అయితే, కుటుంబం మొత్తం బ్రేక్ దర్శనానికి వెళ్లాలనుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 10వేల చొప్పున విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ఎగువ మధ్యతరగతి భక్తులకు శ్రీవారిని బ్రేక్ దర్శనంలో దర్శించుకునే అవకాశం దక్కుతుంది.
ఇలా విరాళం ఇవ్వడం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న వారి కోసం ప్రత్యేక క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు పూర్తి కాగానే వీరిని శ్రీవారి దర్శనానికి పంపిస్తారు. వీరికి కావాల్సిన వసతి గదిని అద్దెకు టీటీడీ సమకూరుస్తుంది.

మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు ఏర్పాటైన శ్రీవాణి ట్రస్ట్‌కు నిధులు సమకూర్చేందుకు గాను ఈ విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు… తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో పెద్ద లడ్డూలు, వడలను కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు టీడీపీ సిద్దమవుతోంది.
ఇప్పటి వరకు పెద్దలడ్డూలు, వడలు కేవలం సిఫార్సు లేఖలున్న వారికి మాత్రమే ఇచ్చేవారు. వాటిని కూడా ఆలయం లోపల వగపడి వద్దే తీసుకోవాల్సి ఉండేది. ఇకపై ఈ పెద్ద లడ్డూలను, వడలను కూడా లడ్డూ కౌంటర్‌లో అందించనున్నారు.
Post A Comment:
0 comments: