పది ’ విద్యార్థులకు ఉదయం టిఫిన్ . . సాయంత్రం స్నాక్స్
ప్రభుత్వ , జెడ్పీ స్కూళ్లలో మాత్రమేకర్నూల్ న్యూస్
నవంబరు మొదటి వారంలో తుది నిర్ణయం
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత కోసం
ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులకు ఉదయం టిఫిన్ , సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ నిర్ణయించారు . హాస్టల్స్ , కస్తూర్బా , ఏపీ మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మినహా మిగిలిన ప్రభుత్వ , జెడ్పీ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు వీటిని అందించనున్నారు . ఇందుకు ఒక్కో విద్యార్థికి 20 రూపాయలు ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు . ఉదయం టిఫిన్ ఒక్కో విద్యార్థికి రూ . 15 , సాయంత్రం స్నాకకు రూ . 5గా నిర్ణయించారు . స్నాక్స్ లో రెండు ఆరటి పండ్లు కానీ , బిస్కెట్స్ కానీ ఇవ్వాలని నిర్ణయించారు . గత విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో జిల్లా 12వ స్థానంలో ఉంది . దీంతో కలెక్టర్ వీరపాండియ న్ . . విద్యాశాఖ అధికారులకు ఒక లక్ష్యం నిర్ణ యించారు . అయితే ప్రత్యేక తరగతులకు విద్యా ర్థులు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారని , ఉదయం , సాయంత్రం టిఫిన్ , స్నాక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుదని టీచర్లు సూచనలు చేయడంతో కలెక్టర్ దీనిపై స్పందించారు . టిఫిన్ , స్నాకు ప్రత్యేకంగా నిధులు - మంజూరు చేస్తామని , ఇందుకు ఒక నిర్దిష్టమైన - ప్రణాళికతో రావాలని , డీఈఓ , డీసీఈబీ అధికా రులకు సూచించారు .
Post A Comment:
0 comments: