కటాఫ్ మార్కుల తగ్గింపు !
గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ప్రతిపాదనలు
గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగ నియామ కాల్లో భాగంగా బీసీ , ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించనున్నారు . దీనిపై 2 , 3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది . నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి కటాఫ్ మార్కుల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ పంప నుంది . బీసీ , ఓసీల కటాఫ్ మార్కులను 5 నుంచి 10 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని తెలుస్తోంది . ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన 47వేల పోస్టుల్లో 25 వేలవరకు భర్తీ అవుతాయని అంచనా . 126 , 728 సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన వాటి భర్తీ కోసం ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది . దీంతో ఈ కేటగిరీలోని పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు .
Post A Comment:
0 comments: