ఇటీవల సర్వేల ప్రకారం భారతదేశంలో కూడా అతివేగంగా విస్తరిస్తున్న వ్యాధి డైయాబెటిస్. ఇందులో కూడా అనేక రకాలు ఉన్నప్పటికీ, ఎందుకు వస్తుందో తెలుసుకొని, వాటికి దూరంగా ఉంటె ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది ? ఎవరికి వస్తుంది అనేది తెలుసుకుందాం.. డైయాబెటిస్ పుట్టిన పాప నుండి వయో వృద్ధుడి వరుకు ఎవరికి అయినా రావచ్చు. సాధారణంగా అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్ అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్య కారణాల వల్ల డైయాబెటిస్ వస్తుంది. డైయాబెటిస్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే డైయాబెటిస్ గురించి ప్రజల్లో ఇప్పుడు అవగాహనా వచ్చింది కానీ అది ఎప్పటి నుండో వస్తుంది.
డైయాబెటిస్ ఉండే ఇళ్లల్లో . తర్వాత వంశానికి రాకూడదు అంటే ముందు నుంచే క్రమం తప్పకుండ వ్యాయామం, బయట ఆహారానికి, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చు. అయితే డైయాబెటిస్ వచ్చిందా ? అని సందేహం ఉంటె.. ఈ లక్షణాలను గమనించి .. మీకు ఉందొ లేదో తెలుసుకోండి.
డైయాబెటిస్ లక్షణాలు :
* అతి దాహం, మితిమీరిన ఆకలి, రాత్రి 4 సార్లు మూత్రానికి వెళ్లాల్సిరావటం
* రక్తంలో గ్లూకోజ్ 250 కి మించి ఉండటం
* మెదడు సంబంధిత సమస్యలు
* కండరాల క్షీణత, బరువు తగ్గటం
డైయాబెటిస్ రాకుండా ఉండటానికి పాటించాల్సిన ఆరోగ్య నియమాలు :
* తగినంత మంచి ఆహారం తీసుకోవటం
* రోజూ కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయటం
* క్రమం తప్పక మందులు వాడటం
* యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండటం
ఈ నియమాలు పాటించి డైయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: