చాలా మంది పిల్లలు తమకు ఇష్టమైన సినీ హీరోల అవయవ సౌష్టవాన్ని చూసి ఎక్సర్‌సైజ్‌ చేయడానికి ఉపక్రమిస్తారు. టీనేజ్‌ దాటకముందే ఎక్సర్‌సైజ్‌లు మొదలుపెడితే అది వారిని ఎత్తుపెరగకుండా చేస్తుందనేది చాలామందిలో ఉండే అపోహ. ఇది పూర్తిగా అవాస్తవం.
పిల్లల్లో ఎత్తు పెరిగే ప్రక్రియ ఎలా జరుగుతుందంటే...
సాధారణంగా పిల్లలు ఎంత ఎత్తుకు పెరగాలన్నది వాళ్ల జన్యువులపై ఆధారపడి ముందుగానే నిర్ణయమవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే వాళ్ల పిల్లలు కూడా కాస్తంత ఎత్తుగానే ఉంటారు. పిల్లలు ఎత్తు పెరగడంలో రెండు దశలుంటాయి. వాటిని లాగ్‌ ఫేజ్‌ అనీ, ల్యాగ్‌ ఫేజ్‌ అంటారు. ఇందులో లాగ్‌ ఫేజ్‌లో పిల్లలు ఒక దశలో అంటే పన్నెండు నుంచి పధ్నాలుగు, పదహారేళ్ల వయసు మధ్య చటాలున అకస్మాత్తుగా ఎత్తుగా అవుతారు. ఆ తర్వాతి దశ ల్యాగ్‌ ఫేజ్‌.ఈ దశలో పెరుగుదల మందగించి... అది  మందకొడిగా సాగుతూ... ఒకటి లేదా రెండు అంగుళాలు మాత్రం పెరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. అది సాధారణంగా 18–21 ఏళ్ల మధ్య జరుగుతుంది.
అంటే కొందరిలో అది 18 ఏళ్లకే ముగిస్తే... మరికొందరిలో చాలా స్వల్పంగా గరిష్టపరిమితంగా 21 ఏళ్ల వరకు సాగుతుంది. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ సాధారణంగా 21 ఏళ్లు వచ్చేసరికి ఎముక చివర ఫ్యూజ్‌ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది. అందుకే సాధారణ ఆటపాటల్లో భాగంగా జరిగే వ్యాయామం వారిలోని అడ్డుపెంచే ప్రక్రియను అడ్డుకోలేదు. పైగా సాగినట్లుగా, వేలాడబడుతూ చేసే స్ట్రెచింగ్‌ వ్యామాయాలు వాళ్ల లాగ్‌ ల్యాగ్‌ ఫేజ్‌లను కొంత ప్రభావితం చేస్తూ ఒకింత ఎత్తు పెంచవచ్చు కూడా. అయితే మన ఎముకల్లో పెరిగే భాగాలు ఎముక చివరన ఉంటాయి. వీటిని గ్రోత్‌ ప్లేట్స్‌ అంటారు.
మనం ఎదిగే వయసులో ఎక్కువ బరువుతో చాలా తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అది గ్రోత్‌ ప్లేట్స్‌ను దెబ్బతీవయచ్చు. అలా గ్రోత్‌ ప్లేట్స్‌ దెబ్బతింటే మాత్రం ఎత్తుపెరగడం ఆగిపోవచ్చు. అందుకే ఈ దశలో వ్యాయామం ఆటల్లో భాగంగా ఉండటం లేదా స్ట్రెచింగ్‌కు పరిమితం కావడం లేదా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటేషన్స్‌తో చేస్తుండటం వల్ల అది ఎత్తు ఎదగడానికి ప్రతిబంధకం కాబోదు. అందుకే పిల్లలు ఎక్సర్‌సైజ్‌ మొదలుపెడితే ఆందోళన పడకుండా వారిని ప్రోత్సహించాలి. అయితే... మరీ ఎక్కువ బరువులు ఎత్తకుండా తక్కువ బరువులు మాత్రమే ఎత్తుతూ ఎక్కువ రిపిటీషన్స్‌ చేయమనీ, స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయాలనీ, ఆటలకు ఎక్కువగా ఆడాలని చెప్పాలి.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: