‘‘ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదు. విటమిన్ 'ఏ' అందని చిన్నారులు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. గుడ్డు వినియోగంలో మాత్రం ఏపీ, తెలంగాణలు రెండూ ముందున్నాయి.’'
ఇవి తాజాగా సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్‌)లో వెల్లడించిన అంశాలు.
యునిసెఫ్, పాపులేషన్ కౌన్సెల్, ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సర్వే నిర్వహించింది.
సూక్ష్మ పోషకాహార అంశాలకు సంబంధించి జాతీయస్థాయిలో తొలిసారిగా అత్యంత విస్తృత స్థాయిలో ఈ సర్వే చేశారు.
పోషకాహారంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్
ఈ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు సరైన పోషహాకారం అందడం లేదని తేలింది.
6 నుంచి 23 నెలల మధ్య వయసున్న చిన్నారుల్లో 'కనీస పోషకాహారం' విషయంలో ఆంధ్రప్రదేశ్ 1.3 శాతంతో చివరి స్థానంలో ఉంది.
35.9 శాతంతో సిక్కిం ప్రథమస్థానంలో నిలవగా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్ రెండు, మూడుస్థానాలలో నిలిచాయి. జాతీయ సగటు 6.4 శాతంగా ఉంది. 3.6 శాతంతో తెలంగాణ 23వ స్థానంతో సరిపెట్టుకుంది.
తెలుగు రాష్ట్రాలు రెండూ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
బరువు తక్కువే..
నవజాత శిశువుల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారుల బరువు విషయానికొస్తే ఝార్ఖండ్‌లో 42.9 శాతం మంది చిన్నారులు ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువుతో ఉన్నారు. ఈ విషయంలో ఝార్ఖండ్‌ అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగు స్థానంలో ఉంది.
ఈ విషయంలో 11.3 శాతంతో మిజోరం అగ్రస్థానంలో ఉండగా, 35.5 శాతం మంది తక్కువ బరువు చిన్నారులతో ఆంధ్రప్రదేశ్ 24వ స్థానంలో నిలించింది. ఇది జాతీయ స్థాయి (33.4 శాతం) కంటే తక్కువ. తెలంగాణ 30.8 శాతంతో ఏపీ కంటే కాస్త మెరుగ్గా ఉంది
మిగిలిన అంశాల్లో ఇలా...
పోషకాహారంపై విస్తృతస్థాయిలో జరిగిన ఈ సర్వేల్లో కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్ 'ఏ' లోపం తీవ్రంగా ఉండడంతో పాటు కూరగాయల వినియోగమూ తక్కువగా ఉంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి.
సీఎన్‌ఎన్‌ఎస్‌ సర్వే ఎలా జరిగింది?
యునిసెఫ్, పాపులేషన్ కౌన్సెల్, ఎంవోహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సీఎన్‌ఎన్‌ఎస్‌ సర్వే నిర్వహించింది.
ఈ తరహా సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సర్వేలో భాగంగా ప్రీ-స్కూల్ (0 నుంచి 4 ఏళ్ల లోపు), బడి పిల్లలు (5 నుంచి 9 ఏళ్ల లోపు), కౌమార దశ పిల్లలు (10 నుంచి 19 ఏళ్లు)ను వివిధ వర్గాలుగా విభజించారు.
ఈ సర్వేలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నవజాత శిశువు నుంచి 19 ఏళ్ల పిల్లల వరకు పోషహాకారం, ఎత్తు, బరువు, స్థూలకాయం, విటమిన్ల సంగ్రహణ తదితర అంశాలను పరిశీలించారు.
2016 ఫిబ్రవరి నుంచి 2018 అక్టోబరు వరకు 30 రాష్ట్రాల్లో ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో 1,12,316 మంది పిల్లలు, కౌమారుల నుంచి వివరాలు సేకరించారు.
51,029 మంది నుంచి రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించారు. 30 రాష్ట్రాల్లో 2500 మంది సర్వే కోసం పనిచేశారు. 200 మంది ట్రైనర్లు, కోఆర్డినేటర్లను నియమించారు.
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు... రాష్ట్రాలవారీగా స్త్రీ, పురుష నిష్పత్తిలో సర్వే అంశాలను విభజించారు.
ప్రధాన నగరాల్లో మురికివాడలు, మురికివాడలు కాని ప్రాంతాలవారీగా (దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా) వివరాలను సేకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 60, తెలంగాణలో 60 ప్రైమరీ శాంపిలింగ్ యూనిట్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేశారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: