ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా.? సడన్‌గా ఆ జర్నీ ప్లాన్ ఛేంజ్ అయిందా.? అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు సింపుల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్ అవుట్‌తో పాటుగా ఒరిజినల్ ఫోటో ఐడీను తీసుకుని రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీస్‌కు చేరుకోవాలి.
పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఏ విధమైన నిబంధనలు వర్తిస్తాయో.. ఈ- టికెట్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. సదరు ప్యాసింజర్… రైలు బయల్దేరే 24 గంటలు ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌లో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఇక ఆ టికెట్‌ను ప్యాసింజర్ కుటుంబానికి మాత్రమే బదిలీ చేస్తారు తప్ప మరింకెవరికి మార్చారు.
Post A Comment:
0 comments: