మంచి ఉద్యోగం సంపాదించాలన్న ఆశయం ఉండాలే కానీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటాయి. వాటితో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీ చేపడుతుంటాయి. ఇటీవల అనేక జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 31 చివరి తేదీ. మొత్తం 8 నోటిఫికేషన్లలో 3,448 ఖాళీలున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.
మొత్తం 186 ఖాళీల భర్తీకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-CCRAS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలను http://www.ccras.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.
http://www.ccras.nic.in/మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-APSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తివివరాలు తెలుసుకోవడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే-NFR భారీగా అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 2590 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 65 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF, రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆప్టికల్ ఇంజనీరింగ్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఎంటెక్ లేదా ఎంఈ చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC బాటనిస్ట్, లీగల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 88 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.
Post A Comment:
0 comments: