ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ గమనించారా.. గమనించకపోతే.. ఇప్పుడైనా గమనించండి.. TS 10 Z 3487, AP 13 Z 6543.. ఇలా ఉంటాయి. ఏ బస్సయినా సరే.. దాని నంబర్ లో Z ఉందంటే.. అది ఆర్టీసీ బస్సే.. అందులో సందేహమే ఉండదు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఈ Z ప్రత్యేకం.. అంతా బాగానే ఉంది. మరి Z ఎందుకు ఉంటుంది.. అన్ని ఆర్టీసీ బస్సులకూ Z తప్పనిసరిగా ఎందుకు ఉంటుంది.?
ఈ విషయం తెలుసుకోవాలంటే దీని వెనుక చాలా కథ ఉంది. ఆర్టీసీకి మూలం నిజాం కాలంలో పడింది. అప్పుట్లో ఆర్టీసీ నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఉండేది. దాన్ని N S R R T D= Nizam state Road and rail Transport Department అని ఏర్పాటు చేశారు. అప్పుడు భారత దేశం అనే దేశం లేదు.
బ్రిటిష్ ఇండియాలో ఎక్కడ కూడా ప్రభుత్వం లో ప్రజా రవాణా లేదు.. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది.
బ్రిటిష్ ఇండియాలో ఎక్కడ కూడా ప్రభుత్వం లో ప్రజా రవాణా లేదు.. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది.
ఈ ఆర్టీసీ ఏర్పాటు కు మూలకారణం.. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ తల్లి జోహ్రా బేగం అని చెబుతారు. ప్రజలు రవాణా సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు గమనించిన ఆమె తన పుట్టింటి నుంచి తెచ్చుకుని రూ. 9 కోట్ల రూపాయలతో 27 బస్సులు కొని ఈ సంస్థను ఏర్పాటు చేశారట. అందుకే ఈ బస్సుల రిజిస్ట్రేషన్‌లో ZOHRAN పేరులోని తొలి అక్షరాన్ని Z ను చేర్చారు.
నిజాం కాలంపోయినా.. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా మారినా ఆ సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. మొదట ఆర్టీసీ నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఉండేది. ఆ తర్వాత NSRTD అని మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వంలో కలిపారు. నిజాం స్థాపించిన అనేక సంస్థలు నిమ్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఇలా నిజాం అనేక సంస్థలు ఏర్పాటు చేశారు.
Post A Comment:
0 comments: