జియో వినియోగదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ ని చెప్పింది. గత రెండు రోజుల ముందే ఇతర నెట్ వర్క్ లకి కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది జియో... ఇవి గురువారం నుండే అమల్లోకి వచ్చాయి. అయితే ఇతర నెట్ వర్క్ లకి కాల్ చేయాలనీ అనుకుంటే పదిరూపాయలతో తప్పకుండా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను కొన్ని టాపప్ ఓచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లో భాగంగా వీటిని వసూలు చేయక తప్పడం లేదని పేర్కొంది. అంతే కాకుండా ఇలా పది రూపాయల టాపప్‌పై అదనంగా ఒక జీబీ డేటా ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. అక్టోబరు 9వ తేదీకి ముందు రీచార్జ్ చేసుకునే ఖాతాదారులకు టాపప్ రీచార్జ్‌తో పనిలేదని స్పష్టం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: