ఊడిపోయిన డోర్‌పైనున్న క్యాబిన్.. భయాందోళనలో ప్రయాణికులు
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన.. అందరూ సురక్షితం
మెట్రో ప్రయాణం అత్యంత సురక్షితం అన్న అధికారుల మాటలు నమ్మేలా కనిపించడం లేదు. ఇటీవల అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో ఓ యువతి మరణించిన ఘటన మరువకముందే.. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు.
Post A Comment:
0 comments: