మాం సాహారంలో మాదిరిగా ప్రొటీన్, చేపల్లో మాదిరిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శాకాహారంలో ఉండవు. అలాగని చింతించాల్సిన పనిలేదు. రోజుకు నాలుగు అక్రోట్లు (వాల్‌నట్స్) తింటే చాలు. వీటిల్లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. అంతేనా? పీచు, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివీ ఎక్కువే. ఇవన్నీ క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బుల వంటి ఎన్నెన్నో సమస్యలు దరిజేరకుండా కాపాడతాయి. అక్రోట్లతో విషయగ్రహణ సామర్థ్యమూ మెరుగవుతుంది. సంతాన సమస్యలు అనగానే ఆడవాళ్ల మీదే దృష్టి సారిస్తుంటారు గానీ మగవారి గురించి పెద్దగా పట్టించుకోరు.
నిజానికి ఈ విషయంలో మగవారికి అక్రోట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
నిజానికి ఈ విషయంలో మగవారికి అక్రోట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
Post A Comment:
0 comments: