ఆస్ట్రేలియాలోని ప్రధాన వార్తా పత్రికలన్నీ సోమవారం తమ మొదటి పేజీలను నలుపు రంగులో ముద్రించాయి. పరస్పరం పోటీ పడే పత్రికా సంస్థలు కూడా ఈ విషయంలో అరుదైన సంఘీభావాన్ని చాటుకున్నాయి. అక్కడి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంక్షలను అలా పత్రికన్నీ ముక్త కంఠంతో నిరసించాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన కఠిన చట్టాలు సమాచారాన్ని ప్రజల వరకూ చేర్చకుండా తమను అడ్డుకుంటున్నాయని వార్తాపత్రికలు ఆరోపిస్తున్నాయి.
ఇదే ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియాలోని పెద్ద మీడియా గ్రూప్ ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ఏబీసీ) ప్రధాన కార్యాలయం, మరో జర్నలిస్ట్ ఇంటిపై దాడులను వ్యతిరేకిస్తూ వార్తా పత్రికల మొదటి పేజీలను నల్లగా ప్రచురించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
విజిల్ బ్లోయర్స్ లీక్ చేసిన సమాచారం ఆధారంగా కొన్ని కథనాలు ప్రచురించిన తర్వాత ఈ దాడులు జరిగాయి.
వార్తాపత్రికల ఈ "రైట్ టూ నో కొయిలేషన్" ఉద్యమాన్ని దేశంలోని టీవీ, రేడియో, ఆన్‌లైన్ గ్రూపులు కూడా సమర్థించాయి.
"గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేనంత కఠిన భద్రత చట్టాన్ని ఆస్ట్రేలియా అమలుచేసింది, దాని వల్ల పరిశోధాత్మక జర్నలిజం ప్రమాదంలో పడింది" అని ఈ ఉద్యమం నడిపేవారు చెబుతున్నారు.
ఈ కొత్త చట్టాలను గత ఏడాదే తీసుకొచ్చారు. ఆ తర్వాత మీడియా సంస్థల జర్నలిస్టులు, విజిల్ బ్లోయర్స్‌కు సున్నిత అంశాల్లో రిపోర్టింగ్‌ చేసేందుకు మినహాయింపు ఇవ్వాలంటూ ఉద్యమం ప్రారంభమైంది.
దాడులకు నిరసనగా నల్లరంగు
సోమవారం దేశంలోని అతిపెద్ద వార్తాపత్రిక, దాని పోటీ పత్రికలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. మొదటి పేజీలో రాసిన అన్ని వాక్యాలు కనిపించకుండా, నల్లరంగు ఉండేలా చేశాయి. వాటిపై 'సీక్రెట్' అని ఎర్రటి ముద్ర వేశాయి.
జాతీయ భద్రతా చట్టాల కారణంగా రిపోర్టింగ్‌పై ఆంక్షలు విధిస్తున్నారు. దేశంలో ఒక 'గోప్యతా సంస్కృతి' ఏర్పడింది అని ఈ వార్తాపత్రికలు చెబుతున్నాయి.
ప్రభుత్వం మాత్రం పత్రికా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తున్నామని చెబుతోంది. కానీ చట్టానికి ఎవరూ అతీతులు కారని అంటోంది.
జూన్‌లో ఏబీసీ హెడ్ క్వార్టర్స్, న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక జర్నలిస్ట్ ఇండిపై దాడులు జరిగిన తర్వాత చాలా వ్యతిరేకతలు వెల్లువెత్తాయి.
లీక్ చేసిన సమాచారం ఆధారంగా ప్రచురించిన కొన్ని రిపోర్టుల తర్వాత ఈ దాడులు జరిగాయని మీడియా సంస్థలు చెబుతున్నాయి.
వీటిలో ఒక కథనంలో యుద్ధ నేరాల గురించి ఆరోపణలు చేస్తే, మరో రిపోర్టులో ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఆస్ట్రేలియా పౌరులపై గూఢచర్యం చేస్తోందని రాశారు.
ఒక్కటైన మీడియా సంస్థలు
న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తన వార్తాపత్రికల మొదటి పేజీల ఫొటోలను ట్వీట్ చేశారు. "మీరు మానుంచి ఏం దాచాలనుకుంటున్నారు అని" ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రజలను కోరారు.
అటు న్యూస్ కార్ప్ పోటీదారు- నైన్ కూడా తన వార్తాపత్రికలు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్', 'ద ఏజ్' మొదటి పేజీలను నల్లరంగులో ప్రచురించింది.
"ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రజాస్వామ్యం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది" అని ఏబీసీ ఎండీ డేవిడ్ అండర్సన్ చెప్పారు.
కానీ, ఈ దాడుల తర్వాత ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయవచ్చని ఆదివారం ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది.
"పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యం, కానీ చట్టం నిబంధనలు కూడా అమలయ్యేలా చూడాలి. మేమైనా, జర్నలిస్టులైనా, వేరే ఏవరైనా అవి అమలు చేయాల్సిందే" అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అన్నారు.
ఆస్ట్రేలియాలో పత్రికా స్వేచ్ఛపై ఒక దర్యాప్తు నివేదికను వచ్చే ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: