భారత్ రిచ్చెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో ఘనత సాధించింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. బాంబే స్టాక్ మార్కెట్లో శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్ విలువ ఓ దశలో రూ.9,01,490 కోట్ల రూపాయలుగా నమోదయింది.
షేర్ల విలువ రెండు శాతం పెరిగి ఒక్కో షేర్ ధర ఇంట్రాడేలో రూ.1,423కు చేరుకుంది. 2018 ఆగస్ట్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంది. కంపెనీ మార్కెట్ విలువ సూచీ స్టాక్ మార్కెట్ ధరల ఆధారంగా ప్రతి రోజు మారుతుంది
జూలై - సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. పెట్రో కెమికల్స్ వ్యాపారంలో నెలకొన్ని బలహీనతలను పరిష్కరించడం కోసం తీసుకున్న చర్యలు, కార్పోరేట్ పన్ను తగ్గింపు నిర్ణయంతో రిటైల్, టెలికం వ్యాపారాలకు కలిసి వచ్చే అవకాశాలు ఉండటంతో సానుకూల సంకేతాలు షేర్ విలువ పెరుగుదలకు కారణమైనట్లుగా చెబుతున్నారు.

Post A Comment:
0 comments: