నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. ఆ పోస్టుల్లో ఇంకా మిగిలిన పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట.
అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం జూన్లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జూలైలో ఇంటర్వ్యూలో నిర్వహించి.. మొత్తం 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరగా..
9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారట.

ఆ నివేదిక ప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,861 పోస్టులుండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయట. డిసెంబరులోగా ఈ పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారట. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం.
Post A Comment:
0 comments: