ప్రస్తుతం యూత్ ను పట్టి పీడిస్తున్న సమస్య బట్టతల. జుట్టు రాలడం సమస్య గురించి యువకులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జుట్టు రాలడం బట్టతలకి కారణమవుతుంది.
వీటికి దూరంగా ఉండండి
కెమికల్ టాబ్లెట్లు తినడంతో జుట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి మహిళలు జుట్టుకు ఎక్కువగా అలంకరణ చేసుకోవడం,వారి జుట్టుకు కృత్రిమ రంగులను ఉపయోగించడం కూడా జుట్టు ఊడటానికి ప్రధాన కారణంగా ఉంది. వేడి మరియు రసాయనాలు జుట్టు బలహీనంగా మరియు పెళుసుగా మార్చుతాయి.
గర్భనిరోధక మాత్రలతో బట్టతల సమస్య అదనంగా, దీర్ఘకాలిక హార్మోన్ల అసమతుల్యతకు మరొక ప్రధాణ కారణం నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు. ధూమపానం అలవాటు ఉంటే, ఖచ్చితంగా వెంటనే పూర్తిగా మానేయండి. ధూమపానం చేసేటప్పుడు పీల్చే కార్బన్ మోనాక్సైడ్, రక్తంలోని వెంట్రుకలకి ఆక్సిజన్, ముఖ్యమైన పోషకాలను రవాణా చేసే ప్రక్రియను అడ్డుకుంటుంది. నికోటిన్ రక్తనాళాన్ని కుదిస్తుంది. జుట్టు పెరగకుండా నిరోధిస్తుంది.
ఆల్కహాల్ ఐరన్ సరఫరాను అణిచివేస్తుంది. జింక్ శోషణను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను చేరకుండా నిరోధిస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టులో నాలుగవ వంతు నీరు కూడా ఉంటుంది.
జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం. హెయిర్ ఫోలికల్ పెరగడానికి శక్తి అవసరం. ధాన్యాలు, చేపలు, మాంసాలలో లభించే కోఎంజైమ్ క్యూ 10 జుట్టు పెరగడానికి అవసరమైన శక్తిని ఉత్పత్తితి చేసే శక్తిని కలిగి ఉంటుంది.
తీసుకోవల్సిన జాగ్రత్తలు
బిజీ జీవితంలో తడి జుట్టుతో ఉండటం.దీంతో జుట్టు రాలడం, జుట్టు చిట్లడం జరుగుతుంది. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే తల దువ్వాలి. తడి లేకుండా జుట్టును బాగా ఆరబెట్టాలి. చాలా మందికి ఎప్పుడూ క్యాపులు ధరించే అలవాటు ఉంటుంది. ఈ కారణంగా జుట్టుకు సరైన ఆక్సిజన్ సరఫరాను కోల్పోవడంతో పాటు.. జుట్టు మూలాలు బలహీనపడతాయి. యువకులు హెయిర్ స్టైలింగ్ కోసం రసాయనాలతో నిండిన హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుకు చాలా నష్టం చేస్తుంది. హెయిర్ జెల్ కూడా జుట్టును బలహీనంగా మార్చుతుంది. జుట్టుకు షాంపూ చేసిన తర్వాత కండీషనర్ వాడరు. షాంపూలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. కాబట్టి షాంపూ చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించడం మర్చిపోవద్దు. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే షాంపూతో స్నానం చేయాలి. వారానికి కనీసం మూడు రాత్రులు కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మర్ధన చేసుకోవాలి. తలకు నూనె రాసిన మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ప్రతి వారంలో జుట్టు చిట్లుతుంటే జుట్టు చివరలను కత్తిరించడం కూడా మంచిదే. బట్టతల సమస్య ఉంది కేవలం పురుషులకు మాత్రమే కాదు…మహిళలకు ఉంది. దీనికి ఒత్తిడి జీవన విధానం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఒత్తిడి వారి శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ల  ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.దీంతో జుట్టు రాలడానికి కారణమయ్యే రసాయనం DTHస్రావం పెరుగుతుంది.
తీసుకోవాల్సిన ఆహారం
జుట్టు రాలే సమస్యను నియంత్రించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ నుండి తయారవుతుంది. పాలక్ సూప్, బాదం, అక్రోట్లను, పన్నీర్, పాలు జుట్టు పెరగడానికి గొప్పగా సహాయపడుతాయి. గ్రీన్ టీ కూడా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ను నిరోధిస్తుంది. నారింజ, పాలక్, చికెన్, ఫిష్, బ్రోకలీ, సోయాబీన్, గోధుమ, పాల ఉత్పత్తులు, వోట్స్, గుడ్డు సొనలు పాలు, ట్యూనా, అరటి, చేపలు, ఆకుపచ్చ ఆకులు, బలవర్థకమైన సిరప్‌లు, బీన్స్‌ ఆహారంలో తీసుకోవాలి.
అంతేకాదు గోరువెచ్చని నూనెతో తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల మీ జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది జుట్టు మూలాలకు బలాన్నిపెంచుతుంది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: