మట్టిలోనే క్యారం బోర్డు రూపొందించి, లోకాన్ని మైమరిచిపోయేలా ఆ ఆటలోనే ఆనందాన్ని ఆస్వాదిస్తోన్న ఈ పిల్లల్ని చూస్తే మట్టిలో మాణిక్యాలంటే ఇలా కూడా ఉంటారేమో అనిపిస్తోంది కదూ.. అవును సరిగ్గా మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రకు సైతం అలానే అనిపించిందట.. అందుకే తనకు వాట్సాప్‌లో ఎవరో పంపించిన ఈ ఫోటోను సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకుని ఆశ్చర్యం వ్యక్తంచేశారాయన. ''ఇండియాలో ఊహశక్తికి కొదువ లేదని నిరూపించేందుకు ఈ ఫొటోనే నిదర్శనం'' అంటూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్‌లో ఫోటో చూశాకా.. నెటిజెన్స్ సైతం వారి టాలెంట్‌కి ఫిదా అవుతున్నారు.
సాధారణంగా క్యారమ్ బోర్డులను చెక్కతో తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చిన్నారులు మాత్రం అందుకు భిన్నంగా మట్టిని చతురస్ర ఆకారంలో తవ్వి, దాన్ని చదును చేసి.. క్యారమ్ బోర్డులో ఉండే రంథ్రాల స్థానంలో నాలుగు వైపులా గుంతలు తవ్వారు. క్యారం కాయిన్స్, స్ట్రైకర్ స్థానంలో కూల్ డ్రింక్స్ సీసాల మూతలను తయారు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్ ముక్కున వేలేసుకునేలా చేస్తోన్న ఈ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.
Post A Comment:
0 comments: