దీపావళి పండుగ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల నుంచి 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి మచీలిపట్నం మధ్య 8 సర్వీసులు నడిపిస్తున్నారు. ఈ రైళ్ళు నవంబర్ 3 వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం 24వ తేదీ వరకు మధ్యాహ్నం 2.25 గంటలకు ప్రారంభమై అదేరోజు సాయంత్రం 10.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇవే రైళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నవంబర్ 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతీ ఆదివారం రాత్రి 11.55 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు చేరుకుంటుంది. గుంటూరు మీదుగా నర్సాపూర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు కూడా ఇవేతేదీల్లో నర్సాపూర్ నుంచి హైదరాబాద్ మధ్య 4 ప్రత్యేకరైళ్ళు నడుస్తాయి. ప్రతీరోజు సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ళు పాలకొల్లు, విజయవాడ ,నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య నాలుగు రైళ్లు ప్రకటించారు. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, డోర్నకల్, ఖమ్మం మీదుగా నవంబర్ 4,11,18,25 తేదీలలో రాత్రి హైదరాబాద్ నుంచి 10.20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం విజయవాడకు ఉదయం 6.35 గంటలకు చేరుకుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: