రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఇప్పటికే ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సిటీలతో పాటు హైదరాబాద్‌లో కూడా అమలవుతోంది. అక్కడ 'సాఫ్ట్' ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉండగా.. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
Post A Comment:
0 comments: