ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో మొత్తం 1.26 లక్షల పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి, నియమాకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో దాదాపు 25 వేలకుపైగా పోస్టులు అర్హులు లేక మిగిలిపోయాయి. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కటాఫ్ మార్కులను నిర్ణయించడంతో కొన్ని జిల్లాల్లో కేటగిరీల్లో పోస్టులు భారీగా మిగిలిపోయాయి. దీంతో ఆయా జిల్లాల్లో పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యరులందరికీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగావకాశం దక్కనుంది. కడప జిల్లాలో ఇప్పటికే సున్నా మార్కులొచ్చిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది. అభ్యర్థుల కొరత ఉంటే మిగతా జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీల్లో అర్హులైన అభ్యర్థులు చాలా జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో ఇప్పటికే కటాఫ్ మార్కులను 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. నోటిఫికేషన్‌లో ప్రస్తావించిన జీవో ప్రకారం అయినా, అర్హులైనవారు లేనిచోట కటాఫ్ మార్కులను తగ్గించుకుంటూ పోయినా ఫలితం ఉండటం లేదు. దీంతో సున్నా మార్కులొచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కడప కలెక్టర్ అధికారులను తాజాగా ఆదేశించారు. అంతేకాదు, అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉన్నచోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మిగతా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు, తమకు కూడా కటాఫ్ మార్కులు తగ్గించాలని బీసీ, ఓసీ అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. కాగా, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో తుది జాబితాకు ఎంపికైన కొందరు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరుకాలేదని, కొన్ని చోట్లు ఒక్క అభ్యర్థే రెండు మూడు జిల్లాలలకు ఎంపికయ్యారని పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఇటీవల వెల్లడించారు.
పోస్టులు మిగిలిపోయాయని, వీటి భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గవని ఆయన స్పష్టం చేశారు.

Post A Comment:
0 comments: