భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని అర్థం. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పెళ్లైన వారు వధువు ఇంట్లో ఈ పండుగను జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి పండుగ వచ్చే సమయంలో ఒక ఊరి పేరు వార్తల్లో నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక ఊరి పేరు దీపావళి. ఈ ఊరికి దీపావళి అనే పేరు రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పూర్వ కాలంలో గుర్రంపై వస్తున్న ఒక ముస్లిం రాజు అనారోగ్యానికి గురి కావటంతో ఒక పాడుబడిన గుడి దగ్గర పడిపోయాడు.
రాజు పడిపోయిన చోట కొందరు గ్రామస్తులు రాజుకు సేవలు చేసి రాజును కాపాడారు.
కింద పడిపోయిన సమయంలో స్పృహ కోల్పోయిన రాజుకు దీపావళి పండుగ రోజున స్పృహ వచ్చింది. రాజు సృహలోకి వచ్చిన తరువాత రక్షించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి ఆ ఊరి పేరు అడిగాడు. గ్రామస్తులు ఈ ఊరికి ఎటువంటి పేరు లేదని రాజుకు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయిన రాజు ఆ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టాడని తెలుస్తోంది.
రాజు పడిపోయిన చోట ఉన్న పాడుబడిన గుడిని కూడా సొంత ఖర్చుతో బాగు చేయించాడు. ఈ గ్రామంలో ప్రజలు ఐదు రోజులు దీపావళి పండుగ జరుపుకుంటారు. తమ ఊరికి దీపావళి అనే పేరు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తామని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. తమ ఊరి పేరు దీపావళి అని ఇతరులకు చెప్పిన సమయంలో అవతలివారు ఆశ్చర్యపోతారని గ్రామస్తులు చెబుతున్నారు.
Post A Comment:
0 comments: