శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు కొనుక్కోవాలనుకునే వారికి ఇది శుభవార్తే. దీపావళి పండుగను పురస్కరించుకుని శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అయిన గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎస్10లపై సంస్థ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ నోట్ 10పై రూ.12 వేలు, ఎస్10పై రూ.14 వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ రెండు ఫోన్ల కొనుగోలుపైనా రూ.9990 విలువైన శాంసంగ్ గెలాక్సీ బడ్స్‌ను రూ.3 వేల డిస్కౌంట్‌తో రూ.6,990కే అందిస్తోంది. అలాగే, రూ.19,990 విలువైన గెలాక్సీ వాచ్ యాక్టివ్‌పై రూ.6 వేల రాయితీ లభించనుంది. గెలాక్సీ ఎస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్, రూ.5 వేల తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ నోట్ 10పై రూ.6 వేల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్, ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6 వేల క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు శాంసంగ్ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: