ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI రెండో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈసారి 330 పోస్టుల్ని భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను fci.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొదట మేనేజ్‌మెంట్ ట్రైనీగా నియమించుకొని 6 నెలలు శిక్షణ ఇవ్వనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 27 చివరి తేదీ.
FCI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
FCI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 330 (నార్త్ జోన్- 187, సౌత్ జోన్- 65, వెస్ట్ జోన్- 15, ఈస్ట్ జోన్- 37, నార్త్ ఈస్ట్ జోన్- 26)
మేనేజర్ (జనరల్)- 22
మేనేజర్ (డిపో)- 87
మేనేజర్ (మూవ్‌మెంట్)- 32
మేనేజర్ (అకౌంట్స్)- 121
మేనేజర్ (టెక్నికల్)- 53
మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 7
మేనేజర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్)- 5
మేనేజర్ (హిందీ)- 3
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 27 సాయంత్రం 4 గంటలు
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 నవంబర్ లేదా డిసెంబర్
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
Post A Comment:
0 comments: