మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా మీ ఆధార్, పాన్ కార్డు, Bank, UAN వివరాలను ఇవ్వరాదని పీఎఫ్ సంస్థ హెచ్చరిస్తోంది. ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి కాల్స్ గానీ, మెసేజ్ లు వచ్చినా స్పందించరాదని తెలిపింది. ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కాల్స్ లో మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేయమని అడిగితే వెంటనే EPFOకు రిపోర్టు చేయాల్సిందిగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ సంస్థ నుంచి ఖాతాదారులకు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయమని ఎలాంటి ఫోన్ కాల్స్ రావని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫోన్ ద్వారా మీ బ్యాంకు లేదా UAN, PAN కార్డు, ఆధార్ వివరాలను EPFO ఎన్నడూ అడగదు. ఏ బ్యాంకులో కూడా డబ్బులు జమ చేయమని EPFO ఎప్పుడూ ఫోన్ కాల్ చేయదు. ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో ఖాతాదారులు స్పందించక పోవడమే మంచిది' అని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్లో, ట్విట్టర్ లో వెల్లడించింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ( EPFO/UAN ) లో లాగిన్ అయి పీఎఫ్ సంబంధిత పనులను ఆన్ లైన్ లో పూర్తి చేసుకోవచ్చు.

గతంలో కూడా పీఎఫ్ సంబంధిత మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ ఖాతాదారులే లక్ష్యంగా వారి వివరాలను తస్కరించేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారు. గత ఏడాది ముంబైలో ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్టు సంస్థ గుర్తించింది. గూగుల్ సెర్చ్ లో కూడా మోసగాళ్లు ఈపీఎఫ్ నెంబర్ల మాదిరిగా కనిపించేలా ఉంచుతారు. ఇలాంటి ఫోన్ నెంబర్ల విషయంలోనూ ఖాతాదారులు జాగ్రత్త వహించాలని సూచిస్తోంది.
12 సంఖ్యల గల ఏకైక UAN నెంబర్ ను తమ ఖాతాదారులకు EPFO కేటాయిస్తుంది. పీఎఫ్ అకౌంట్ యాక్టివ్ గా ఉన్న ఖాతాదారుల కోసం జూలై 31, 2014 నుంచి నవంబర్ 30, 2016 మధ్య కాలంలో UAN నెంబర్ విధానాన్ని సంస్థ అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 2016 నుంచి పీఎఫ్ ఖాతాదారులకు UAN నెంబర్ కేటాయించడం జరుగుతోంది. ఆధార్ నెంబర్ ద్వారా UAN నెంబర్ ను యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుంది.
Post A Comment:
0 comments: