ఈనెల 19 వరకు విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. బస్సు సర్వీసులు పునరుద్ధరించడానికి కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సమ్మె చేస్తున్నవారితో చర్చల్లేవని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని తెగేసి చెప్పారు సీఎం.
విధుల్లో ఉన్నవారికి జీతాలు చెల్లిస్తామని తెలిపారు. మూడ్రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అధికారులను అదేశించారు. మరోవైపు నియామకాలపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. సమ్మె చట్ట విరుద్ధంగా జరుగుతోందన్నారాయన. మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు నడిపేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
Post A Comment:
0 comments: