చాలా మందికి శరీర ఆకృతి అంతా బాగా ఉంటుంది, కానీ పొట్ట దగ్గరకు వచ్చేసరికి అందవిహీనంగా ఉంటుంది. అందుకు ఏకైక కారణం అక్కడ పేరుకుపోయిన కొవ్వు. వయసుకు సంబంధం లేకుండా కొవ్వు అంత పేరుకుపోయింటుంది. అయితే ఆ కొవ్వు తగ్గాలంటే మీరు రోజు చేసే వ్యాయామంతో పాటు ఇక్కడ ఉన్న ఆహారపదార్ధాలను తీసుకుంటే పొత్తికడుపు చుట్టూ అతిగా పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించుకోవచ్చు. ఆ ఆహారం ఏంటో తెలుసుకుందాం..
* నిమ్మరసం కొవ్వును కరిగిస్తుంది. అందుకే ఉదయం లేవగానే గ్లాసెడు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి.
* పరగడుపునే గోరువెచ్చని నీటిలో చెంచాడు అల్లం రసం కలుపుకొని తాగితే పొత్తికడుపు చుట్టూ అతిగా చేరిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.
* ఉదయం నిద్రలేవగానే నోరు పుక్కిలించి రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే పొట్ట కిందిభాగంలో చేరిన కొవ్వు కరిగిపోతుంది.
* ఉదయం నిద్రలేవగానే నోరు పుక్కిలించి రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే పొట్ట కిందిభాగంలో చేరిన కొవ్వు కరిగిపోతుంది.
* రోజూ అల్పాహారానికి ముందు 4 చెంచాల పుదీనా ఆకుల రసం తాగితే పొట్ట కరగటమే గాక జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.
* ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు గ్లాసు కీరదోసకాయ రసం తాగితే పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఇందులో ఏ ఒక్క చిట్కా క్రమంగా పాటించిన పట్టిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
Post A Comment:
0 comments: