రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కొన్ని రోజుల్లోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకు వార్షిక ఎంసీఎల్‌ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. తద్వారా గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది ఆరోసారి కావడం విశేషం. పండగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ తాజా నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం అయిన వడ్డీ రేట్లు పది బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి.
ఎస్‌బీఐ కొత్తవారికి రెపోరేటు అనుసంధానిత గృహ రుణాలను అందిస్తోంది. దీనివల్ల ఆర్‌బీఐ బెంచ్ మార్క్ రేటును సవరించిన ప్రతిసారీ రుణ వడ్డీ రేటు సైతం మారుతూ ఉంటుంది.
ఎస్‌బీఐ కొత్తవారికి రెపోరేటు అనుసంధానిత గృహ రుణాలను అందిస్తోంది. దీనివల్ల ఆర్‌బీఐ బెంచ్ మార్క్ రేటును సవరించిన ప్రతిసారీ రుణ వడ్డీ రేటు సైతం మారుతూ ఉంటుంది.
మరోవైపు, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఎస్‌బీఐ వడ్డీరేట్లను సవరించింది. రూ. లక్షకు పైగా పొదుపు ఖాతాలపై 3.5శాతం నుంచి 3.25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నవంబనే 1 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే వివిధ కాలపరిమితులకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ డిపాజిట్లకు సైతం ఈ తగ్గింపు వర్తించనుంది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబరు 10నుంచి అమలులోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును మాత్రం అలాగే కొనసాగిస్తోంది. ఇక, 7 నుంచి 45 రోజుల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.50 శాతానికి, 180 నుంచి సంవత్సర కాలపరిమితి గల డిపాజిట్లపై కూడా 5.80శాతానికి వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది.
Post A Comment:
0 comments: