యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిషన్ అంతర్గతంగా ఓ కమిటీ వేసి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలను ఇంజనీరింగ్,టీచింగ్,సివిల్ సర్వీసెస్,మెడికల్,జనరల్ సర్వీసెస్ గ్రూపులుగా విభజించాలని కమిషన్ ఫ్లాన్ చేస్తోంది.
వీటికి అనుగుణంగా ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో గ్రూప్ నకు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ గ్రూపుల్లో ఉండే ప్రత్యేకమైన(న్యాయ,ఆర్థిక,తదితర)పోస్టులకు మాత్రం వాటి అర్హతలను అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరుగనుందని తెలుస్తోంది.
నెలాఖరులోగా గ్రూపులపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం దీనిని పరిశీలించిన అనంతరం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
నెలాఖరులోగా గ్రూపులపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం దీనిని పరిశీలించిన అనంతరం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Post A Comment:
0 comments: