దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నట్లే పేటీయం కూడా మహా క్యాష్ బ్యాక్ కార్నివాల్ ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 6 వరకు జరగనుంది. అంతేకాకుండా రెడ్ మీ ఫోన్లపై ఇప్పుడు పేటీయం క్రాకర్ డీల్స్ ను ప్రకటించింది. ఈ క్రాకర్ డీల్స్ లో భాగంగా వినియోగదారులు రెడ్ మీ ఫోన్లను రూ.99కే పొందవచ్చు. ఇందులో బడ్జెట్ ఫోన్లు అయితే రూ.1కే లభించే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన సేల్స్ కూడా అక్టోబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ డీల్ కు సంబంధించిన సేల్ లో పాల్గొని ఈ వస్తువులను ఆయా ధరలకే కొనుగోలు చేయడానికి ఒకే మార్గం ఉంది. ఈ క్రాకర్ డీల్స్ సేల్ అక్టోబర్ 6 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో జరగనుంది.
ఈ సేల్ లో మీరు పూర్తి ధర పెట్టి మొబైల్ ను కొనుగోలు చేస్తే మిగతా మొత్తం క్యాష్ బ్యాక్ గా తిరిగి మీ వ్యాలెట్లోకే వస్తుంది. ఈ సేల్ లో ఏయే షావోమి ఫోన్లు ఉంటాయో పేటీయం తెలిపలేదు. డీల్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆ ఫోన్ల వివరాలను తెలిపే అవకాశం ఉంది. ముందే చెప్పినట్లు ఇందులో రెడ్ మీ ఫోన్లు రూ.99కి, బడ్జెట్ ఫోన్లు రూ.1కే లభ్యమయ్యే అవకాశం ఉంది.
ఈ సేల్ లో మీరు పూర్తి ధర పెట్టి మొబైల్ ను కొనుగోలు చేస్తే మిగతా మొత్తం క్యాష్ బ్యాక్ గా తిరిగి మీ వ్యాలెట్లోకే వస్తుంది. ఈ సేల్ లో ఏయే షావోమి ఫోన్లు ఉంటాయో పేటీయం తెలిపలేదు. డీల్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆ ఫోన్ల వివరాలను తెలిపే అవకాశం ఉంది. ముందే చెప్పినట్లు ఇందులో రెడ్ మీ ఫోన్లు రూ.99కి, బడ్జెట్ ఫోన్లు రూ.1కే లభ్యమయ్యే అవకాశం ఉంది.
ఇంకా ఈ సేల్ లో మిగతా ఉత్పత్తులపై కూడా అదిరిపోయే ఆఫర్లున్నాయి. అంతే కాకుండా మీరు ఒకేసారి షాపింగ్ చేసే మొత్తం రూ.5 వేలకు మించినట్లయితే బ్యాంకు ఆఫర్లు కూడా లభిస్తాయి. హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోళ్లకు కూడా వర్తిస్తుంది.
ఈ పేటీయం మెగా క్యాష్ బ్యాక్ సేల్ లో భాగంగా యాపిల్, శాంసంగ్, ఒప్పో, వివో, షావోమి తదితర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్, రూ.17 వేల వరకు ఎక్స్ చేంజ్ లాభాలు కూడా అందించనున్నారు. ఈ సేల్ సందర్భంగా వివో స్మార్ ఫోన్లపై కొన్ని అదిరిపోయే ఆఫర్లు అందించారు. రూ.26,990 విలువ చేసే వివో వీ15 స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభించనుంది.
అంటే కేవలం రూ.13,450కే దీన్ని విక్రయిస్తున్నారు. అలాగే రూ.15,990 విలువ చేసే వివో వై15 రూ.9,652కే, రూ.9,990 విలువ చేసే వివో వై91 రూ.5,632కే అందిస్తున్నారు. వివో వై15లో 5000 mAh బ్యాటరీ అందుబాటులో ఉంది. అన్నిటి కంటే అత్యుత్తమమైన డీల్ ఏంటి అంటే.. రూ.32,990 విలువ చేసే వివో వీ15 ప్రో రూ.17,751కే లభించనుంది. అంతేకాకుండా మిగతా బ్రాండ్లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందించనున్నారు. కాబట్టి ఈ పండుగకు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలనుకునే వారు కేవలం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల వైపే కాకుండా పేటీయం వైపు కూడా ఒక లుక్కేయండి!
Post A Comment:
0 comments: