ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు ప్రకటన ప్రారంభమయ్యింది. వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. ఈ మేరకు సోమవారం కమిటీ నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. 2019కి విలియం కెలిన్, సర్ పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెంజాలు ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. వైద్యరంగంలో అవార్డులు దక్కించుకున్న వారిలో గ్రెగ్ సెమెంజా, విలియం కెలిన్లు అమెరికాకు చెందినవారు.. సర్ పీటర్ రాట్క్లిఫ్ యూకేకు చెందినవారు.
హైపోక్సియా పరిశోధనలు చేసినందుకు ఈ ముగ్గురికి పురస్కారాన్ని ప్రకటించారు. విలియమ్ కేలిన్, సర్ పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెంజాలు.. శరీరంలో ప్రాణవాయువు స్థాయులు తగ్గినప్పుడు కణాలు తమ పనితీరును మార్చుకుని.. దానికి అనుగుణంగా ఎలా స్పందిస్తాయో పరిశోధన చేశారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్హోమ్లో పురస్కారాన్ని అందజేస్తారు. ఇక భౌతిక, రసాయన శాస్త్రాల్లో పురస్కారాలను మంగళ, బుధవారాల్లో ప్రకటిస్తారు. గురువారం సాహిత్యం.. శుక్రవారం శాంతి పురస్కారాలు ప్రకటిస్తారు. ఇక ఆర్థికశాస్త్రంలో 14న ప్రకటిస్తారు.
Post A Comment:
0 comments: