నల్లధనం వెలికితీత దిశగా గొప్ప ముందడుగు పడింది. స్విస్ బ్యాంకుల్లో కోట్ల కొద్ది బ్లాక్‌మనీ కూడపెట్టిన భారతీయుల తొలిదశ వివరాలు.. మన దేశానికి అప్పగించింది స్విట్జర్లాండ్. ఇరుదేశాల మధ్య కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం ఈ వివరాలు అందజేసింది . స్విట్జర్లాండ్ నుంచి ఈ తరహా వివరాలు అందడం ఇదే తొలిసారి. ఈ లిస్ట్‌లో ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న అకౌంట్ల వివరాలతోపాటు.. 2018లో అకౌంట్ క్లోజ్ చేసిన వారి వివరాలు కూడా ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌లో అకౌంట్లకు సంబంధించిన రెండో దశ లిస్టును మనదేశానికి అందజేయనుంది స్విట్జర్లాండ్.
లెక్కల్లో చూపెట్టని వేల కోట్ల డబ్బుని మనదేశానికి చెందిన చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్విస్ బ్యాంకుల్లో దాచారన్న ఆరోపణలున్నాయి. విదేశీ అకౌంట్లకు సంబంధించిన సమాచారం విషయంలో స్విస్ బ్యాంకులు చాలా గోపత్య పాటిస్తాయి. అందుకే మన దేశానికి చెందిన బడాబాబులతోపాటు.. వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది ఇక్కడ కోట్లకు కోట్లు కూడబెట్టారు. అయితే ఈ డబ్బుని తిరిగి ఇండియాకు రప్పించేందుకు ఎప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ భారతీయుల అకౌంట్ల వివరాలు ఇచ్చేందుకు మొదట స్విట్జర్లాండ్ నిరాకరించింది. అయితే అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో స్విస్ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు..ఇప్పుడిప్పుడే వివిధ దేశాలకు చెందిన అకౌంట్ల వివరాలును వెల్లడిస్తున్నారు.
స్విట్జర్లాండ్ అందించిన తొలి లిస్టులో ఎవరెవరి అకౌంట్లు ఉన్నాయన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఆ వివరాలను బయటకు వెల్లడిస్తారా లేదా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరం.
Post A Comment:
0 comments: