మన ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ చెక్-అప్ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. గంటలు గంటలు అక్కడే ఉండి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గంటల కొద్ది ఆస్పత్రిలో వేచి ఉండలేక చాలా మంది వైద్య పరీక్షలు అంటేనే భయపడిపోతుంటారు. కానీ ఇకపై భయపడాల్సిన అవసరంలేదు. ఆస్పత్రికి అసలే వెళ్లాల్సిన అవసరంలేదు. అత్యంత వేగంగా వైద్య పరీక్షలు నిర్వహించే అధునాతన మెషిన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది అచ్చం ఏటీఎం మాదిరిగా ఉంటుంది.
సూపర్ ఫాస్ట్ మెడికల్ చెక్-అప్ మెషిన్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇది 55 ప్రాథమిక, అధునాతన వైద్య పరీక్షలను పరీక్షిస్తుంది. అంతేకాదు వెంటనే రిపోర్ట్స్ కూడా అందిస్తుంది.
ఈ ‘స్వయం-ఎనీటైమ్ హెల్త్ మానిటరింగ్ (AHM)’ పరికరం.. హెల్త్‌కేర్ స్టార్టప్ అయిన సాన్‌స్క్రైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేత డెవలప్ చేయబడింది. స్వయం AHM అనేది ‘మేడ్ ఇన్ ఇండియా’ పరికరం. బహుశా ఇది భారత దేశ మొట్ట మొదటి అధునాతన స్వీయ పర్యవేక్షణ ఆరోగ్య విశ్లేషణ మెషిన్ కావొచ్చు.
ఈ ‘స్వయం-ఎనీటైమ్ హెల్త్ మానిటరింగ్ (AHM)’ పరికరం.. హెల్త్‌కేర్ స్టార్టప్ అయిన సాన్‌స్క్రైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేత డెవలప్ చేయబడింది. స్వయం AHM అనేది ‘మేడ్ ఇన్ ఇండియా’ పరికరం. బహుశా ఇది భారత దేశ మొట్ట మొదటి అధునాతన స్వీయ పర్యవేక్షణ ఆరోగ్య విశ్లేషణ మెషిన్ కావొచ్చు.
అయితే ఏటీఏం మెషిన్ లా(స్వయం AHM) ఉండే పరికరాన్ని ఉపయోగించడం చాలా సులభమని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తయినా దీని ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఈ మెషిన్ బ్లడ్ గ్లూకోజ్, డెంగ్యూ, హిమోగ్లోబిన్, టైఫాయిడ్, హెచ్ఐవి, మలేరియా, చికున్ గున్యా, ఎలిఫాంటియాసిస్, మూత్ర పరీక్షలు, ఇసిజి, చెవి పరీక్ష, చర్మ పరీక్ష మొదలైన 58 రకాల పరీక్షలను అందించగలదు. ఈ హైటెక్ డయాగ్నొస్టిక్ సిస్టమ్ కొన్ని నిమిషాల్లోనే ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపంలో వైద్య పరీక్ష నివేదికలను అందిస్తుంది. సాధారణంగా ఆస్పత్రుల్లో ఇలాంటి నివేదికలు పొందడానికి కొన్ని గంటల నుండి రోజులు పడుతుంది.
ఈ మెషిన్ ఆవిష్కరణకు సానుకూల స్పందన ఉందని చెప్పారు కంపెనీ ప్రతినిధి తెలిపారు. "గత ఆరు నెలల్లో తాము POC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్) చేసిన ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. తాము ఇప్పటికే ఆర్డర్లు అందుకున్నామని, భారతదేశంలోని . భువనేశ్వర్, గుర్గావ్, ఇండోర్ మొదలైన ప్రాంతాల్లో ఈ యంత్రాలను కూడా పంపిణీ చేసామన్నారు. కార్పొరేట్ గృహాలు, బిజినెస్ పార్కులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్ క్లినిక్‌లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, పరిశ్రమలు, నివాస కాలనీలలో ఈ స్వయం కియోస్క్‌లను ఏర్పాటు చేయవచ్చని స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రీతమ్ కుమావత్ తెలిపారు.
స్వయం AHM ను ఎలా ఉపయోగించాలి:
దశ-1: రిజిస్ట్రేషన్
మొట్టమొదటిసారి వినియోగదారు మొబైల్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, స్థానం రిజిస్ట్రేషన్ చేసి “స్వయం AHM” ని యాక్సెస్ చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అనుసరించాలి. యూజర్ ఫోటో, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
దశ 2- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం... ధృవీకరణ కోసం మీరు OTP ని పొందుతారు. OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆప్షన్ ఎంచుకోవడానికి అటోమెటిక్ గా లాగిన్ అవుతారు.
దశ 3- లాగిన్ ప్రక్రియ తర్వాత ఎంచుకోవడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. 1) హెల్త్ చెక్ అప్, 2) వైద్యుడిని సంప్రదించండి 3) హెల్త్ హిస్టరీని సంప్రదించండి. అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి.
ఆప్షన్స్ వివరణ 1) ఆరోగ్య పరీక్ష – హెల్త్ చెక్ అప్స్ కు సంబంధించింది 55 పరీక్షల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అన్ని రిపోర్టులు PDF ఫైల్ లో అందిస్తుంది. అంతేకాదు ఇవి సేవ్ చేయబడతాయి. ఏదైనా ఇ-మెయిల్ ఐడికి పంపబడతాయి. వినియోగదారు తన రిపోర్టును ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
2) వైద్యుడిని సంప్రదించండి - డాక్టర్‌తో లైవ్ వీడియోలో సంప్రదింపులు చేయవచ్చు. డాక్టర్ వినియోగదారుని కియోస్క్‌తో జతచేయబడిన వెబ్‌క్యామ్, డెర్మాస్కోప్, ఓటోస్కోప్ తో ఇటీవల చేసిన పరీక్షల రిపోర్టును అంచనా వేయవచ్చు. డాక్టర్ మీకు మెడిషిన్స్ తో పాటు సూచనలను కూడా చెప్పవచ్చు. మీరు ప్రిస్క్రిప్షన్ రిపోర్ట్ ను ప్రింట్ తీసుకోవచ్చు,. అదే రిపోర్టు మీ అకౌంట్ హిస్టరీలో సేవ్ చేయబడుతుంది.
3) ఆరోగ్య చరిత్ర – కియోస్క్ ( AHM) అన్ని హెల్త్ రిపోర్టులు తేదీ, సమయం, ప్లేస్ వారీగా సేవ్ చేయబడతాయి. వినియోగదారు తన మునుపటి రిపోర్టు, ఇ-మెయిల్‌లను చూడవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. మునుపటి అన్ని ప్రిస్క్రిప్షన్ రిపోర్టులను ఇక్కడ నుండి యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారు బయట ల్యాబ్ టెస్టుల రిపోర్టులను USB( పెన్ డ్రైవ్) ద్వారా అటాచ్ చేయవచ్చు. ఇమెయిల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . ఆ రిపోర్టులను తన స్వయం AHM ఖాతాలో అప్‌లోడ్ చేయవచ్చు. ఇది మెడికల్ చెక్ అప్ లకు సులభంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
Post A Comment:
0 comments: