ఈరోజుల్లో డిగ్రీ చదవడం కామన్ అయ్యింది. డిగ్రీ ఏం ఖర్మ.. ఇంజినీరింగే రొటీన్ అయ్యింది. అయితే ఎంత చదివినా ఉద్యోగం దొరకడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారుతోంది. అందులోనూ ఇక ప్రభుత్వోద్యోగం అంటే.. విపరీతమైన పోటీ..
ఇక్కడే ఓ కీలక విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. అందరూ పోటీ పడే ఉద్యోగాల వైపే చూస్తున్నారు తప్పించి.. మిగిలిన అవకాశాల వైపు చూడటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏటా.. అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అందులో కొన్ని పోస్టులు కేవలం పదో తరగతి అర్హతతోనే.
అలాంటి ఓ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసింది. అదే కోస్టు గార్డులో నావిక్ పోస్టులు.. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్టు గార్డు..
నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) - 01/2020 బ్యాచ్
నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) - 01/2020 బ్యాచ్
ఉద్యోగాల వివరాలు.. కుక్, స్టీవార్డ్.. ఈ ఉద్యోగాలకు అర్హత కేవలం పదోతరగతి మాత్రమే. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. అంతే కాదు.. ఈ ఉద్యోగాలు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే.
కేవలం 18-22 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఈ ఉద్యోగాలకు అర్హులు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే.. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, మెడికల్ టెస్టుల ఆధారంగా నియామకం ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా ఈ నెల అక్టోబరు 30 నుంచి నవంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://joinindiancoastguard.gov.in వెబ్ సైట్ ను చూడండి.
Post A Comment:
0 comments: