యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మీ ఆధార్ భద్రత కోసం కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. మీ ఆధార్ నంబర్ ను లాక్, అన్ లాక్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్య గోప్యత, భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకోబడిందని యూఐడీఏఐ(UIDAI) తెలిపింది.
మీరు మీ అధార్ నంబర్ ను లాక్ చేసిన తర్వాత మరే ఇతర అవసరాలకు ఎవరూ ఉపయోగించలేరు. ఉదా: జనాభా, బయోమెట్రిక్ లేదా OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) ఆధారితమైనవి, ఆధార్ సంఖ్యను ఉపయోగించి చేయలేరు. అందువల్ల, KYC ప్రయోజనాల కోసం ఏదైనా సేవలను చేపట్టడానికి మీరు ఆధార్ కోసం 16-అంకెల వర్చువల్ ID ని ఉపయోగించాల్సి ఉంటుంది.
మీరు మీ ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేసిన తర్వాత మాత్రమే గుర్తింపు అవసరాల కోసం ఉపయోగించవచ్చు.
మీరు మీ ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేసిన తర్వాత మాత్రమే గుర్తింపు అవసరాల కోసం ఉపయోగించవచ్చు.
మీరు ఆధార్ నంబర్ ను లాక్ చేసే ముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోకపోతే మీ ఆధార్ నంబర్ ను మీరు లాక్ చేయలేరు. మీరు యూఐడీఏఐ(UIDAI) వెబ్‌సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా మీ వర్చువల్ ID ని రూపొందించుకోవచ్చు. SMS ద్వారా మీ వర్చువల్ ID ని రూపొందించడానికి మీ మొబైల్ నంబర్ UIDAI వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి.
రెండు పద్దతుల ద్వారా మీ ఆధార్ ను లాక్ లేదా అన్ లాక్ చేసుకోచ్చు.
UIDAI యొక్క వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు.
మీ మొబైల్ నంబర్ నుంచి క్యాపిటల్ లెటర్స్ లో UIDAI అని టైప్ చేసి 1947 అనే నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి.
UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆధార్ నంబర్‌ను లాక్ చేయడం / అన్‌లాక్ చేయాలంటే కింది పద్దతులను ఫాలో అవాలి.
ఆధార్ నంబర్ ను లాక్ చేయాలంటే!
ముందుగా www.uidai.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం “My Aadhar” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత “Aadhar Services” ఆప్షన్స్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత “Aadhar Lock/ Unlock” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. “Lock Uid” ని సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను పిన్ కోడ్, సెక్యూరిట్ కోడ్ తో సహా ఎంటర్ చేయాలి. అనంతరం ఓటీపీ(OTP) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఈ ఓటీపీ వ్యాలిడిటి 10 నిమిషాలు మాత్రమే. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్(Submit) బటన్ పై నొక్కాలి. వెంటనే మీ ఆధార్ నంబర్ లాక్ అవుతుంది.
ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పుడు ఆధార్ నంబర్ ను SMS ద్వారా లాక్ / అన్ లాక్ చేయాలంటే!
మీకు ఇంటర్నెట్‌కు సౌకర్యం లేకపోతే లేదా మీరు UIDAI యొక్క వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే SMS ద్వారా మీ ఆధార్ నంబర్‌ను కూడా లాక్ / అన్‌లాక్ చేయవచ్చు.
మీ మొబైల్ నంబర్ నుంచి 1947 కు SMS పంపడం ద్వారా మీ ఆధార్ నంబర్‌ను లాక్ / అన్‌లాక్ ఇలా చేసుకోవచ్చు. OTP పొందడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1947 కు SMS పంపండి. GETOTP <SPACE> ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలు. ఉదాహరణకు మీ ఆధార్ నంబర్ 1234 5678 4321 అయితే, SMS GETOTP 4321 గా పంపించాలి. మీరు SMS పంపిన తర్వాత UIDAI మీకు SMS ద్వారా 6-అంకెల OTP ని పంపుతుంది. ఆతర్వాత మరొక SMS పంపించాలి. LOCKUID <SPACE> ఆధార్ సంఖ్య చివరి నాలుగు అంకెలు <SPACE> 6 అంకెల OTP సంఖ్యను ఎస్ఎంఎస్ పంపించాలి. SMS పంపిన తర్వాత UIDAI మీ ఆధార్ నంబర్‌ను లాక్ చేస్తుంది. లాక్ అయినట్లుగా మీ మొబైల్ నంబర్ కు మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్‌లతో రిజిస్టర్ చేయబడి ఉంటే మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలకు బదులుగా, చివరి ఎనిమిది అంకెలను ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది.
మీ ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేయాలంటే
OTP పొందడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1947 కు SMS పంపండి: GETOTP <SPACE> మీ వర్చువల్ ID సంఖ్య యొక్క చివరి ఆరు అంకెలను ఎస్ఎంఎస్ పంపించాలి. మీరు SMS పంపిన తర్వాత UIDAI మీకు SMS ద్వారా 6-అంకెల OTP ని పంపుతుంది. మీ ఆధార్ నంబర్‌ను అన్‌లాక్ చేయడానికి మీరు రెండవ SMS పంపాలి. UNLOCKUID <SPACE> వర్చువల్ ID చివరి ఆరు అంకెలు <SPACE> 6 అంకెల OTP సంఖ్యను ఎస్ఎంఎస్ చేయాలి. ఇక మీ ఆధార్ నంబర్ అన్ లాక్ అవుతుంది. అదేవిధంగా మీ మొబైల్ నంబర్ ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్‌లతో అనుసంధానించబడి ఉంటే.. మీ వర్చువల్ ఐడి చివరి ఆరు అంకెలకు బదులుగా, మీఆధార్ నంబర్ చివరి 10 అంకెలను పంపవలసి ఉంటుంది. ఇలా మీ ఆధార్ నంబర్ ను లాక్/అన్ లాక్ చేసుకోవచ్చు.
Post A Comment:
0 comments: