పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగించింది. గురువారం రాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు అక్టోబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అయితే అందరికీ ఇది వర్తించదు. కేవలం ఫైలింగ్‌కు ముందు ఆడిట్ అవసరమయ్యే కేసులకు మాత్రమే ఈ గుడవు పొడిగింపు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ఏబీ కిందకు వచ్చే సంస్థలు దాఖలు చేసే ఐటీఆర్‌కు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, ప్రొప్రైటర్‌షిప్ సహా పలు ఇతర సంస్థలు ఈ కేటగిరి కిందకు వస్తాయి. వీటి అకౌంట్లు ఫైలింగ్‌కు ముందే ఆడిట్ చేయాల్సి ఉంటుంది.

Post A Comment:
0 comments: