కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ ఓ గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేట్లను తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్‌బిఏపై నెలా నెలా చెల్లించే 8.5 శాతం వడ్డీ ఇకపై 7.9 శాతానికి తగ్గనుంది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లు తగ్గుతాయని గత నెలలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంతింటి కలపై దష్టిసారించేందుకు వీలు కలగనుంది. బ్యాంకుల నుంచి సామాన్యులు తీసుకునే గృహ రుణాల తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA కూడా పొందే అవకాశం ఉంటుంది. శాశ్వత ఉద్యోగులతో పాటు, ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న తాత్కాలిక సిబ్బందికి కూడా ఈ హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వర్తిస్తుంది.
Post A Comment:
0 comments: