గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులోభాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా,వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2)గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్(గ్రేడ్-2)గా, ఏఎన్‌ఎమ్ పోస్టును ఏఎన్‌ఎమ్ గ్రేడ్-3గా మార్చారు. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్-2,ఉద్యానశాఖ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడు, పట్టుపరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుడు,డిజిటల్ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6 డిజిటల్ సహాయకుడిగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Post A Comment:
0 comments: