ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సందర్భంగా మరోసారి ఆఫర్ల వర్షానికి తెరతీయనుంది. ఈ నెల 12 -16 మధ్య ‘బిగ్ దీవాలీ సేల్’ను నిర్వహించనుంది. అదే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకయితే ఈ పండుగ ఒక నాలుగు గంటలముందు అంటే అక్టోబర్11 రాత్రి 8 గంటలనుంచే మొదలుకానుంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలపై, ఇతర ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, దుస్తులపై ధమాకా ఆఫర్లను అందించనుంది.
స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఖచ్చితమైన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్‌లలో భారీ డిస్కౌంట్లు, బైబ్యాక్ గ్యారెంటీ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను ఆశించవచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే రెడ్‌మి నోట్ 7 ప్రో, వివో జెడ్ 1 ప్రో, రియల్‌మే సి 2, రియల్‌మే 5 ,రెడ్‌మి నోట్ 7 ఎస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించవచ్చని అంచనా. బిగ్ దీపావళి సేల్‌లో టీవీలు, ఇతర 50 వేల ఉత్పత్తులపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇంకా స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌లాంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై 90శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేయనుంది. అలాగే ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతోపాటు, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అర్థరాత్రి 12 నుండి తెల్లవారుఝామున 2 గంటల మధ్య రష్ అవర్ వ్యవధిలో అదనపు డిస్కౌంట్లను అందిస్తుంది.
Post A Comment:
0 comments: