రింగ్ టైమ్ తగ్గించిన ఎయిర్‌టెల్, ఐడియా
జియో నిర్ణయమే కారణం
ముంబయి: భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తమ రింగింగ్ సమయాన్ని 30-45 సెకన్ల నుంచి 25 సెకన్లకు తగ్గించాయి. ప్రస్తుతం జియో అనుసరిస్తున్న విధానానికి తగ్గట్లుగా వారు మార్పులు చేశారు. ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా సమయాన్ని తగ్గించగా.. వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని ప్రాంతాలకే ఈ తగ్గింపును పరిమితం చేసింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ(ఐయూసీ) నిబంధనల్ని ఉల్లంఘించి జియో తొలుత రింగింగ్ సమయాన్ని 20సెకన్లకు తగ్గించిందని అనంతరం తిరిగి 25 సెకన్లకు పెంచిందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. రింగ్ సమయం తక్కువ ఉండడం అవతలి వ్యక్తి తిరిగి కాల్ చేయడాన్ని ప్రోత్సహిస్తోందన్నది వారి ప్రధాన ఆరోపణ.
కాల్ చేసిన నెట్‌వర్క్ వారు కాల్ ముగిసిన నెట్‌వర్క్‌కి ఐయూసీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఐయూసీ ఛార్జీల వల్ల అధికంగా ఆదాయం పొందుతున్న కంపెనీల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఉన్నాయి. ఇక అధికంగా చెల్లిస్తున్న కంపెనీల్లో జియో ఉంది. ఈ నేపథ్యంలో జియో రింగ్ సమయం తగ్గించడం వల్ల ఎక్కువ మిస్డ్ కాల్స్ నమోదవుతాయని దీనివల్ల అవతలి వ్యక్తి తిరిగి జియో నెట్‌వర్క్‌కి కాల్ చేయాల్సి వస్తుందని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్రధాన ఆరోపణ. అయితే జియో మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం 15-20సెకన్లు రింగ్ సమయం ఉంటే చాలని తెలిపింది. దీనిపై స్పందించిన ట్రాయ్ రింగ్ టైమ్‌పై నెట్‌వర్క్ ఆపరేటర్లంతా ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. దీనిపై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది

Post A Comment:
0 comments: