2019


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు.
మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ
నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం
నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు స్వీకరణ
నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన
నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు
నవంబర్‌ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన
డిసెంబర్ 1నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి



మాం సాహారంలో మాదిరిగా ప్రొటీన్‌, చేపల్లో మాదిరిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శాకాహారంలో ఉండవు. అలాగని చింతించాల్సిన పనిలేదు. రోజుకు నాలుగు అక్రోట్లు (వాల్‌నట్స్‌) తింటే చాలు. వీటిల్లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. అంతేనా? పీచు, ప్రొటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటివీ ఎక్కువే. ఇవన్నీ క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి ఎన్నెన్నో సమస్యలు దరిజేరకుండా కాపాడతాయి. అక్రోట్లతో విషయగ్రహణ సామర్థ్యమూ మెరుగవుతుంది. సంతాన సమస్యలు అనగానే ఆడవాళ్ల మీదే దృష్టి సారిస్తుంటారు గానీ మగవారి గురించి పెద్దగా పట్టించుకోరు.
నిజానికి ఈ విషయంలో మగవారికి అక్రోట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.



మంచి ఉద్యోగం సంపాదించాలన్న ఆశయం ఉండాలే కానీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంటాయి. వాటితో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగాల భర్తీ చేపడుతుంటాయి. ఇటీవల అనేక జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 31 చివరి తేదీ. మొత్తం 8 నోటిఫికేషన్లలో 3,448 ఖాళీలున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.
మొత్తం 186 ఖాళీల భర్తీకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-CCRAS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలను http://www.ccras.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.
http://www.ccras.nic.in/మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-APSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తివివరాలు తెలుసుకోవడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే-NFR భారీగా అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 2590 పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 65 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF, రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆప్టికల్ ఇంజనీరింగ్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఎంటెక్ లేదా ఎంఈ చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC బాటనిస్ట్, లీగల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 88 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.



ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఉపాధి లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉండటం. దీంతో అధకార పక్షం ఇసుక సరఫరాలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీ ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. జ‌న‌సేన విశాఖ‌లో లాంగ్ మార్చ్ చేయాల‌ని నిర్ణ‌యించింది.

అయితే, వ‌ర‌ద‌ల కార‌ణంగా కొంత కొర‌త ఉంద‌ని, అధిగ‌మించేందుకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. అస‌లు ఇసుక స‌మ‌స్య‌కు కార‌ణాలు ఏంటి... దీనికి మూలాలు ఎక్కడ?

అపార వనరులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక ల‌భ్య‌త‌కు అన్ని ర‌కాలుగా అవ‌కాశాలున్నాయి. ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణా, పెన్నా, తుంగ‌భ‌ద్ర వంటి న‌దీ తీరాల‌లోనూ, అన్ని కాలువ‌ల ద్వారానూ ఇసుక ల‌భిస్తోంది. నాణ్య‌మైన ఇసుక ల‌భిస్తుండ‌డంతో ఇక్కడి నుంచి తెలంగాణకు కూడా ప‌లు రీచ్‌ల నుంచి ఇసుక స‌ర‌ఫ‌రా అయ్యేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

గ‌డిచిన ఐదు నెల‌లుగా ఇసుక కొరత తీవ్రమైంది. భవన నిర్మాణ పనులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి వరద ఒక కారణమైతే, వైసీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ మరో కారణమని తెలుస్తోంది.

రెండు ప్రభుత్వాలు.. అనేక విధానాలు
ఇసుక విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం కూడా ప‌లు ప్ర‌యోగాలు చేసింది. ఇసుక‌ ఉచితంగా సరఫరా చేయడంతో పాటు డ్వాక్రా గ్రూపుల ద్వారా త‌వ్వ‌కాలు చేపట్టింది. అయితే, ఇసుక త‌వ్వ‌కాల‌ను కొంద‌రు త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకుని, పెద్ద స్థాయిలో అక్ర‌మార్జ‌న‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక మాఫియా వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అప్పుడు అధికార పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు నేరుగా ఇసుక వ్య‌వ‌హారాల్లో భాగ‌స్వాముల‌యిన‌ట్టు ఆరోపణలు వచ్చాయి. నాటి దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇసుక వ్యవహారంలో త‌హాశీల్దార్ వ‌న‌జాక్షి మీద దాడికి దిగడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక విధానంలో మాఫియాకు, అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌త కోస‌మంటూ ఇసుక త‌వ్వ‌కాల అనుమ‌తి విష‌యంలో జాప్యం చేసింది.

మే నెలాఖ‌రులో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కూ ఇసుక త‌వ్వ‌కాలు నిలిపివేసింది. ఆ తర్వాత ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో ఇసుక బుకింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇసుక అవ‌స‌రమైన వారు ట‌న్నుకు రూ.375 చొప్పున బ్యాంకులో చ‌లానా తీసి, ఆధార్ కార్డు, నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి ప‌త్రాల‌ను తీసుకుని రెవెన్యూ కార్యాల‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

దానికి ముందుగా వెబ్ సైట్ లో రిజిస్ట‌ర్ చేసుకుంటే ఓ నెంబ‌ర్ వ‌స్తుంది. వాటిని ఆధారం చేసుకుని ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతాల్లోని త‌హాశీల్దార్ ఆఫీసుకి వెళితే అక్క‌డ వారు ర్యాంప్ కేటాయిస్తారు. ఆ ర్యాంపు ద‌గ్గ‌ర ఉన్న ఏపీఎండీసీ సిబ్బంది ప‌రిస్థితిని బ‌ట్టి ఇసుక లోడుకి అనుమ‌తిస్తున్నారు. ఇసుక త‌ర‌లింపు కోసం దూరాన్ని బ‌ట్టి ఛార్జీ వ‌సూలు చేస్తారు.

ఇలా కూడా సమస్యలే
ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానం వల్ల తీవ్ర స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని, ఇసుక కోసం ర్యాంపుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని భవన నిర్మాణదారు టి. శ్రీనివాస్ చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఇసుకను గ‌తంలో క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు ఇస్తామ‌ని చెప్పారు. గ‌తంలో రూ. 2,500 ఇస్తే జిల్లాలో ఎక్కడికైనా ట‌న్ను ఇసుక వచ్చేది. కానీ ఇప్పుడు బ్యాంకుల చుట్టూ చ‌ల‌నా కోసం తిర‌గ‌డం, ఆ త‌ర్వాత త‌హాశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిర‌గ‌డానికే స‌రిపోతోంది. వారం రోజులు పైగా ప‌ని మానుకోని తిరిగితేగానీ ఇసుక దొర‌క‌డం లేదు. ఇసుక 15 రోజుల‌కు వ‌స్తుందో, నెల‌కు వ‌స్తుందో కూడా గ్యారంటీ లేదు. మా ద‌గ్గ‌ర‌కు ఇసుక వచ్చేసరికి ట్రిప్పుకే రూ. 4,500 అవుతుంది. లారీ వాళ్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. క‌న‌స్ట్ర‌క్ష‌న్స్ మొద‌లెట్టిన మా లాంటి వాళ్ల స‌మస్య‌ల గురించి ప్ర‌భుత్వం ఆలోచించాలి'' అని తెలిపారు.

నిర్మాణాలు నిలిచిపోయి.. ఉపాధి పోయి
ఇసుక ల‌భ్య‌త నిలిచిపోవ‌డంతో భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఉపాధికి విఘాతం క‌లిగింది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులున్నారు. వారితో పాటుగా భ‌వ‌న నిర్మాణ అనుబంధ రంగాలైన ఇటుక త‌యారీ, కంక‌ర క్వారీలు, మెటీరియ‌ల్ ర‌వాణా లారీలు స‌హా వివిధ రంగాల్లో మ‌రో 20 ల‌క్ష‌ల మంది కార్మికులు ఆధార‌ప‌డి ఉంటార‌ని అంచ‌నా. ఇసుక కొరత మూలంగా 3 నెల‌ల పాటు పూర్తిగా ఉపాధి నిలిచిపోయింద‌ని భ‌వ‌న నిర్మాణ మేస్త్రీ కంచుమ‌ర్తి కాటంరాజు బీబీసీకి తెలిపారు.

''భవ‌న నిర్మాణాల‌కు సీజ‌న్ లేకపోవడం అంటూ ఉండ‌దు. వేస‌విలో నిర్మాణాలు చేస్తే, వ‌ర్షాల స‌మ‌యంలో ఫినిషింగ్ వ‌ర్క్ చేస్తాం. కానీ, ఇప్పుడు గ‌తంలో ప‌నికి వెళ్లిన వారిలో నూటికి ఐదుగురికి కూడా ప‌ని దొర‌క‌డం లేదు. దాంతో ప‌నుల్లేక చాలా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఒక్క మేస్త్రీలకే కాకుండా కూలీలు, కార్పెంట‌ర్లు, ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్క‌ర్లు, రాడ్ బెండింగ్ , సెంట్రింగ్ వ‌ర్క‌ర్లకి కూడా ప‌నుల్లేకుండా పోయింది. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేదు'' అని చెప్పారు.

తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురంలో ఫాల్జీ బ్రిక్ యూనిట్ న‌డుపుతున్న బి వెంక‌ట్ కూడా ఇలాంటి అభిప్రాయ‌మే వ్య‌క్తం చేశారు. ''గతంలో నేను ఇదే సీజ‌న్‌లో నెల‌కు 1.8 ల‌క్ష‌ల ఇటుకలు త‌యారీ చేశాను. కానీ ఇప్పుడు 10 వేలు కూడా అమ్ముడు పోవ‌డం లేదు. మా యూనిట్‌లో 12 మంది కార్మికులు ప‌నిచేసేవారు. ఇప్పుడు ఒక్క‌రు మాత్ర‌మే ప‌నిచేయ‌డానికి అవ‌కాశం ఉంది. మాలాంటి అన్ని యూనిట్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి. అప్పులు చేసి గ‌డుపుతున్నాం'' అని అన్నారు.

లారీల య‌జ‌మానుల‌క‌యితే మ‌రింత స‌మ‌స్య‌గా ఉంద‌ని గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లికి చెందిన లారీ య‌జ‌మాని ర‌వీంద్ర అంటున్నారు. లారీల‌కు కిస్తీలు కూడా క‌ట్ట‌లేక‌పోతున్నామని, నాలుగు నెల‌ల‌కు పైసా ఆదాయం లేదని చెప్పారు. ''మూడు లారీలున్నాయి. రెండు నెల‌ల పాటు పూర్తిగా మూల‌న‌ప‌డ్డాయి. ఇప్పుడు నెల‌కు 10 రోజులు తిప్పుతున్నాం. రోజుకి ఒక ట్రిప్పు వేస్తే రూ. 2 వేల లోపు ఆదాయం వ‌స్తోంది. బ్యాంకుల‌కు అప్పులు కూడా క‌ట్ట‌లేక స‌త‌మ‌త‌మ‌యిపోతున్నాం'' అంటూ వాపోయారు.

ప్రభుత్వం ఏమంటోంది?
అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఇసుక ల‌భించ‌డం లేద‌ని ప్ర‌భుత్వం కూడా అంగీక‌రిస్తోంది. స‌మ‌స్య‌ను అధిగమించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్నాంటున్నారు. అధికారిక వివ‌రాల ప్ర‌కారం ఏపీలో మొత్తం 151 ఇసుక రీచులున్నాయి. వాటిలో 36 రీచుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం 115 రీచులు ఇసుక త‌వ్వ‌కాల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 79 రీచుల‌కు వ‌ర‌ద తాకిడి కార‌ణంగా ఇసుక త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు.

ఇసుక స‌మ‌స్య‌పై ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి స‌ల్మాన్ ఆరోఖ్య రాజ్ మాట్లాడుతూ, ''రాష్ట్రంలో రోజుకి 80 నుంచి 85 ట‌న్నుల ఇసుక అవ‌స‌రం అవుతుంది. అది నిర్మాణాలు పుంజుకుంటే ల‌క్ష ట‌న్నులకు చేరుతుంది. అయితే ప్ర‌స్తుతం ఏపీఎండీసీ స్టాక్ పాయింట్ల ద్వారా 45 టన్నుల ఇసుక అందిస్తున్నాం. న‌దుల్లో వ‌ర‌ద నీరు త‌గ్గితే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా అందించ‌గ‌లం. ర్యాంపుల‌న్నీ అందుబాటులోకి వ‌స్తే స‌మ‌స్య తీరుతుంది. ప్ర‌స్తుతం తాత్కాలికంగా ఏరులు, వాగులు, వంక‌ల్లో కూడా ఇసుక త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చాం. త‌ద్వారా స్థానికంగా ఇసుక అవ‌స‌రం అయినా వారికి అది చేరుతుంది. అందుకు అనుగుణంగా మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చి అందుబాటులోకి తీసుకొచ్చాం'' అని పేర్కొన్నారు.

'వరద నీటి వల్లే'
గ‌త ప‌దేళ్లుగా ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి వ‌ర్షాల కార‌ణంగా దాదాపు అన్ని న‌దుల‌కు వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది. గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో గ‌డిచిన 70 రోజులుగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది. దాని కార‌ణంగానే ఇసుక స‌మ‌స్య వ‌స్తోంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. వ‌ర‌ద కార‌ణంగా 70 రీచులలో త‌వ్వ‌కాల‌కు అవ‌కాశం లేకుండా పోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు.

''నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు.

గత 30-40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా చేశామని మంత్రి వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ప్రతినిధులతో మాట్లాడి వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించామని చెప్పారు.

'ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్యం'
ఇసుక విష‌యంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం మూలంగానే కార్మికులు, భ‌వ‌న య‌జ‌మానులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని టీడీపీ, జ‌న‌సేన స‌హా వివిధ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల మీద క‌క్ష‌తో వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని, ఇసుక ర్యాంపుల నుంచి టీడీపీ శ్రేణుల‌ను దూరం చేయ‌డం కోస‌మే మూడు నెల‌ల పాటు మూత వేశారని చెప్పారు.

no image
Know your school MDM Bill status/Mandal MDM Bill status/ /Find MDM Bill Status /Mid Day Meals Bill Claim Status.

Know your school MDM Bill status/Mandal MDM Bill status/  Find MDM Bill Status Mid Day Meals Bill Claim Status. Mid Day Meals Bills every month are claimed by the Schools for the expenditure incurred as per the attendance. The MDM Bills are sent to the MRCs and the Bills are prepared by MRC and sent to the Treasury Officials for approval. The approved Bills are then credited in cash to the respective Cooker Cum Helper Dwackra Group Accounts.
 All the Schools in Andhra Pradesh can find the MDM Bill Claim Status of their Schools. Find MDM Bill Status Mid Day Meals Bill Claim Status

know school MDM Bill status


మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా మీ ఆధార్, పాన్ కార్డు, Bank, UAN వివరాలను ఇవ్వరాదని పీఎఫ్ సంస్థ హెచ్చరిస్తోంది. ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి కాల్స్ గానీ, మెసేజ్ లు వచ్చినా స్పందించరాదని తెలిపింది. ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన కాల్స్ లో మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేయమని అడిగితే వెంటనే EPFOకు రిపోర్టు చేయాల్సిందిగా పేర్కొంది. ఈపీఎఫ్ఓ సంస్థ నుంచి ఖాతాదారులకు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయమని ఎలాంటి ఫోన్ కాల్స్ రావని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫోన్ ద్వారా మీ బ్యాంకు లేదా UAN, PAN కార్డు, ఆధార్ వివరాలను EPFO ఎన్నడూ అడగదు. ఏ బ్యాంకులో కూడా డబ్బులు జమ చేయమని EPFO ఎప్పుడూ ఫోన్ కాల్ చేయదు. ఇలాంటి ఫేక్ కాల్స్ విషయంలో ఖాతాదారులు స్పందించక పోవడమే మంచిది' అని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్లో, ట్విట్టర్ లో వెల్లడించింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ ( EPFO/UAN ) లో లాగిన్ అయి పీఎఫ్ సంబంధిత పనులను ఆన్ లైన్ లో పూర్తి చేసుకోవచ్చు.
గతంలో కూడా పీఎఫ్ సంబంధిత మోసాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పీఎఫ్ ఖాతాదారులే లక్ష్యంగా వారి వివరాలను తస్కరించేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారు. గత ఏడాది ముంబైలో ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్టు సంస్థ గుర్తించింది. గూగుల్ సెర్చ్ లో కూడా మోసగాళ్లు ఈపీఎఫ్ నెంబర్ల మాదిరిగా కనిపించేలా ఉంచుతారు. ఇలాంటి ఫోన్ నెంబర్ల విషయంలోనూ ఖాతాదారులు జాగ్రత్త వహించాలని సూచిస్తోంది.
12 సంఖ్యల గల ఏకైక UAN నెంబర్ ను తమ ఖాతాదారులకు EPFO కేటాయిస్తుంది. పీఎఫ్ అకౌంట్ యాక్టివ్ గా ఉన్న ఖాతాదారుల కోసం జూలై 31, 2014 నుంచి నవంబర్ 30, 2016 మధ్య కాలంలో UAN నెంబర్ విధానాన్ని సంస్థ అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 2016 నుంచి పీఎఫ్ ఖాతాదారులకు UAN నెంబర్ కేటాయించడం జరుగుతోంది. ఆధార్ నెంబర్ ద్వారా UAN నెంబర్ ను యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుంది.


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఇప్పటికే ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సిటీలతో పాటు హైదరాబాద్‌లో కూడా అమలవుతోంది. అక్కడ 'సాఫ్ట్' ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉండగా.. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసినట్లు సమాచారం.



నిరుద్యోగులకు ఈస్ట్రన్ రైల్వే తీపికబురు అందించింది. తాజాగా ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సి లెవెల్ 2 టెక్నిషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. అయితే అర్హులైన అభ్యర్థులు అంత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందు చివరి తేదీ డిసెంబర్ 1, 2019గా పేర్కొంది.
కాగా ఈస్ట్రన్ రైల్వేస్ సంస్దలో 21 టెక్నీషియన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జాబ్ చెయ్యాల్సిన స్థలం కోల్కత్త, పశ్చిమ బెంగాల్. 10 తరగతి విద్యార్హతతో పాటు ఐటిఐ కూడా ఉండాలి. కాగా వయసు 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
అయితే అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/- ఉండగా ఇతరులకు రూ.500/- ఉంది.
అయితే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 1, 2019 నుంచి ఆరంభమై డిసెంబర్ 1, 2019 నాటికి ముగుస్తుంది. కాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం https://er.indianrailways.gov.in/ ఈ వెబ్సైట్ ను సంప్రదించి తెలుసుకోండి. కాగా 10వ తరగతితో ఐటిఐ చదువు ఉన్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 1 ప్రారంభమవుతుంది.

https://er.indianrailways.gov.in/



🔰చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా,లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥ మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి మంజూరుచేస్తారు రూల్ -15A


🔰గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.


🔰పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.
(G.O.Ms.No.98 తేది:19-06-1992)


🔰సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ పార్ట్ ఫైనల్ డ్రాయల్ మంజూరు చేయరాదు రూల్-15B


🔰GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకుంటే ఎటువంటి రికవరీ ఉండదు.


🔰GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును అపెండిక్స్-O లో సమర్పించాలి.


🍕ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు రూల్-28,29,30


🔰GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్,ఫైనల్ విత్ డ్రాయల్ బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి.అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.


🍀జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు,
మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు.
(G.O.Ms.No.447 Dt:28-03-2011)
Google Bolo- The best Language Learning Android App

Help your children learn to read -- anytime, anywhere -- using just their voice

Designed for primary grade children, Bolo helps to improve their reading skills, by encouraging them to read aloud and giving them instant feedback - even when completely offline.

Bolo comes with a fun and helpful reading tutor, “Diya”, which is powered by the same speech technology that is in the Google Assistant.
Google Bolo- The best Language Learning Android App    Help your children learn to read -- anytime, anywhere -- using just their voice    Designed for primary grade children, Bolo helps to improve their reading skills, by encouraging them to read aloud and giving them instant feedback - even when completely offline.    Bolo comes with a fun and helpful reading tutor, “Diya”, which is powered by the same speech technology that is in the Google Assistant.        Bolo helps children:    Read all by themselves: Bolo listens to what your children read, encourages them when they read well and helps them when they get stuck - just like a real reading tutor.    Choose from a large variety of engaging stories in multiple languages:  The app comes preloaded with a large collection of engaging & carefully selected stories in:  • English  • Hindi (हिंदी)  • Bangla (বাংলা)  • Urdu (اردو)  • Telugu (తెలుగు)  • Marathi (मराठी)  • Tamil (தமிழ்)  • Spanish (Español)  • Portuguese (Português)  All the reading material on the app is completely free, with new stories added regularly!    Enjoy as they learn: Children can also play interesting word games and earn in-app awards, helping reading become both fun and a daily habit.    Personalised for each child: Multiple children can use the same app, and track their progress separately. Over time the difficulty level of recommended stories adjusts to their reading skills.    Read without distractions (and without data too): The app works even when completely offline, and shows no ads, so your children can just focus on reading.    Let us inspire your children to fall in love with reading and become better readers!    టెక్నాలజీ ,సెర్చి ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. 'బోలో' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వేదికను అభివృద్ధి చేసే దిశగా గూగుల్ ఈ కొత్త యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీనిద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లిష్ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు.  ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లిష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది.  పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా  ఈ యాప్ ద్వారా పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది.  ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్  గూగుల్ అందించే బోల్ యాప్ లో ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్ ఉన్నాయి. ఫన్నీగా, ప్లేఫుల్ గా పదాలను పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా రూపొందించింది. బోలో యాప్ ను పిల్లలంతా తమ ప్రొగ్రెస్ ను వేర్వేరుగా ట్రాక్ చేసుకోవచ్చు.  ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే  ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ఆఫ్ లైన్ లో కూడా బోలో యాప్ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి యాడ్స్ డిసిప్లే కావు. దీంతో పిల్లలు రీడింగ్ పైనే దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇంటర్నేట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా యాక్సస్ అయ్యేందుకు వీలుగా గూగుల్ ఈ యాప్ ను రూపొందించింది.  స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ  ఈ యాప్‌‌‌ను స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్‌ ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాడ్‌ ఫ్రీ ఉన్న ఈ 'బోలో' యాప్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం.  200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు  గూగుల్ ఈ యాప్‌ను 'యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్‌ సెంటర్‌ (ASER)' సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరగడాన్ని గుర్తించినట్లు తెలిపింది.  ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం  నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందని గూగుల్ ధీమా వ్యక్తంచేసింది.ఈ యాప్ లో రీడింగ్ మెటేరియల్ క్యాటలాగ్ కూడా ఉన్నాయి.  ఎన్నో స్టోరీలు  ఇందులో ఎన్నో స్టోరీలు ఉంటాయి. పిల్లలు చదివేందుకు వీలుగా ఇంగ్లీష్ భాషలో 40 స్టోరీలు, హిందీ భాషలో 50 స్టోరీలు ఉంటాయి. ఈ స్టోరీలన్నీ పూర్తిగా ఉచితంగా గూగుల్ అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టోరీలను అందించే దిశగా గూగుల్ ప్లాన్ చేస్తోంది.  అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ  అన్నీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 (కిట్ కాట్)కు హైయర్ వర్షన్ లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ప్రాంతీయ హిందీ మాట్లాడేవారి కోసం మాత్రమే డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.    Download Google Bolo App


Bolo helps children:

Read all by themselves: Bolo listens to what your children read, encourages them when they read well and helps them when they get stuck - just like a real reading tutor.

Choose from a large variety of engaging stories in multiple languages:
The app comes preloaded with a large collection of engaging & carefully selected stories in:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)
All the reading material on the app is completely free, with new stories added regularly!

Enjoy as they learn: Children can also play interesting word games and earn in-app awards, helping reading become both fun and a daily habit.

Personalised for each child: Multiple children can use the same app, and track their progress separately. Over time the difficulty level of recommended stories adjusts to their reading skills.

Read without distractions (and without data too): The app works even when completely offline, and shows no ads, so your children can just focus on reading.

Let us inspire your children to fall in love with reading and become better readers!

టెక్నాలజీ ,సెర్చి ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. 'బోలో' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వేదికను అభివృద్ధి చేసే దిశగా గూగుల్ ఈ కొత్త యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీనిద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లిష్ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు.
ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లిష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది.
పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా
ఈ యాప్ ద్వారా పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది.
ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్
గూగుల్ అందించే బోల్ యాప్ లో ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్ ఉన్నాయి. ఫన్నీగా, ప్లేఫుల్ గా పదాలను పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా రూపొందించింది. బోలో యాప్ ను పిల్లలంతా తమ ప్రొగ్రెస్ ను వేర్వేరుగా ట్రాక్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే
ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ఆఫ్ లైన్ లో కూడా బోలో యాప్ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి యాడ్స్ డిసిప్లే కావు. దీంతో పిల్లలు రీడింగ్ పైనే దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇంటర్నేట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా యాక్సస్ అయ్యేందుకు వీలుగా గూగుల్ ఈ యాప్ ను రూపొందించింది.
స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ
ఈ యాప్‌‌‌ను స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్‌ ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాడ్‌ ఫ్రీ ఉన్న ఈ 'బోలో' యాప్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం.
200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు
గూగుల్ ఈ యాప్‌ను 'యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్‌ సెంటర్‌ (ASER)' సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరగడాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం
నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందని గూగుల్ ధీమా వ్యక్తంచేసింది.ఈ యాప్ లో రీడింగ్ మెటేరియల్ క్యాటలాగ్ కూడా ఉన్నాయి.
ఎన్నో స్టోరీలు
ఇందులో ఎన్నో స్టోరీలు ఉంటాయి. పిల్లలు చదివేందుకు వీలుగా ఇంగ్లీష్ భాషలో 40 స్టోరీలు, హిందీ భాషలో 50 స్టోరీలు ఉంటాయి. ఈ స్టోరీలన్నీ పూర్తిగా ఉచితంగా గూగుల్ అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టోరీలను అందించే దిశగా గూగుల్ ప్లాన్ చేస్తోంది.
అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ
అన్నీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 (కిట్ కాట్)కు హైయర్ వర్షన్ లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ప్రాంతీయ హిందీ మాట్లాడేవారి కోసం మాత్రమే డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.

Download Google Bolo App
AP School Mid day meal rice alocation Allotment - AP MDM Rice allotment - MDM Month wise rice alotment, MDM School Rice alotemt, Mid day meal Rice month wise allotment, How to know my school MDM Rice allotment, alocation

MDM RICE --- School WISE MDM ALLOCATION / ALLOTMENT and OB (FPS)

1 RO STATUS
2 MAPPING
3 SCHOOLWISE ALLOTMENT
4 ISKON / AKSHAY PATRA ALLOTMENT
5 NOT AVAILED LIST
6 SUMMER ALLOCATION (SHOP WISE)
7 SUMMER ALLOCATION (MLS WISE)
8 SHOP WISE SUMMER DISTRIBUTION
AP School Mid day meal rice alocation Allotment - AP MDM Rice allotment - MDM Month wise rice alotment, MDM School Rice alotemt, Mid day meal Rice month wise allotment, How to know my school MDM Rice allotment, alocation  MDM RICE --- School WISE MDM ALLOCATION / ALLOTMENT and OB (FPS) 1 RO STATUS  2 MAPPING  3 SCHOOLWISE ALLOTMENT  4 ISKON / AKSHAY PATRA ALLOTMENT  5 NOT AVAILED LIST  6 SUMMER ALLOCATION (SHOP WISE)  7 SUMMER ALLOCATION (MLS WISE)  8 SHOP WISE SUMMER DISTRIBUTION      THE ABOVE PERTICULARS WE FIND FROM THIS WEBSITE    Steps... to know school wise Rice  Mid Day Meal Scheme is implementing in all Government /Local Bodies Schools. In this regard MDM Rice is being supplied to every school. Hence we need to know every month MDM Rice Allocation details for our schools. Here You will get your School MDM Rice Allocation for any month. School wise mdm rice allotment, mid day meal rice, mdm rice monthly allocation, mid day meal rice, mdm rice allotment are available in this page with your school dise code only.  First Enter your School Dise Code  Then select your desired month and year  Then Get Details.    Know Our school MDM Rice allocation /Allotment

THE ABOVE PERTICULARS WE FIND FROM THIS WEBSITE

Steps... to know school wise Rice
Mid Day Meal Scheme is implementing in all Government /Local Bodies Schools. In this regard MDM Rice is being supplied to every school. Hence we need to know every month MDM Rice Allocation details for our schools. Here You will get your School MDM Rice Allocation for any month. School wise mdm rice allotment, mid day meal rice, mdm rice monthly allocation, mid day meal rice, mdm rice allotment are available in this page with your school dise code only.
First Enter your School Dise Code
Then select your desired month and year
Then Get Details.

Know Our school MDM Rice allocation /Allotment
Google Indic Keyboard -  Easy Telugu typeing App in mobile phone
Google Indic Keyboard -  Easy Telugu typeing App in mobile phone      Google Indic Keyboard allows you to type messages, update on social networks or compose emails in your own native language on your Android phone. Currently it includes the following keyboards:    - English keyboard  - Assamese keyboard (অসমীয়া)  - Bengali keyboard (বাংলা)  - Gujarati keyboard (ગુજરાતી)  - Hindi keyboard (हिंदी)  - Kannada keyboard (ಕನ್ನಡ)  - Malayalam keyboard (മലയാളം)  - Marathi keyboard (मराठी)  - Odia keyboard (ଓଡ଼ିଆ)  - Punjabi keyboard (ਪੰਜਾਬੀ)  - Tamil keyboard (தமிழ்)  - Telugu keyboard (తెలుగు)    On your phone, if you can read your language in its native script above, you may install and use Google Indic Keyboard to input your language; otherwise your phone may not support your language.    Google Indic Keyboard supports different modes of input:    - Transliteration mode - Get output in your native language by spelling out the pronunciation using English letters (For example, “namaste“ -> “नमस्ते“.)    - Native keyboard mode - Type directly in native script.    - Handwriting mode (currently available for Hindi only) - Write directly on your phone screen.    - Hinglish mode - If you choose “Hindi” as an input language, the English keyboard will suggest both English and Hinglish terms.    How can I enable it and set it as the default keyboard?  Open Settings  -> Language & Input, under “KEYBOARD & INPUT METHODS” section, go to Current Keyboard -> Choose Keyboards -> Check “Google Indic Keyboard” -> back to “Language & input” -> Current Keyboard -> Select “English & Indic Languages (Google Indic Keyboard)”When typing in an input box, you can also change the default input method by clicking the keyboard icon on the bottom right corner of the screen.    How to use Google Keyboard on any phone: In brief To switch to the Google Keyboard just follow these simple steps: Open the Google Play Store app on your phone and search for Google Keyboard.  Install Google Keyboard  Open Settings on your smartphone then in the Personal section tap on Language & Input  In the Keyboard & Input section tap on the Current Keyboard option and then select Google Keyboard from the options.  Launch any app with a text field (email, messaging, search, etc.) and the Google Keyboard should now be your default.    DOWNLOAD.....Google Indic Keyboard - .App

Google Indic Keyboard allows you to type messages, update on social networks or compose emails in your own native language on your Android phone. Currently it includes the following keyboards:

- English keyboard
- Assamese keyboard (অসমীয়া)
- Bengali keyboard (বাংলা)
- Gujarati keyboard (ગુજરાતી)
- Hindi keyboard (हिंदी)
- Kannada keyboard (ಕನ್ನಡ)
- Malayalam keyboard (മലയാളം)
- Marathi keyboard (मराठी)
- Odia keyboard (ଓଡ଼ିଆ)
- Punjabi keyboard (ਪੰਜਾਬੀ)
- Tamil keyboard (தமிழ்)
- Telugu keyboard (తెలుగు)

On your phone, if you can read your language in its native script above, you may install and use Google Indic Keyboard to input your language; otherwise your phone may not support your language.

Google Indic Keyboard supports different modes of input:

- Transliteration mode - Get output in your native language by spelling out the pronunciation using English letters (For example, “namaste“ -> “नमस्ते“.)

- Native keyboard mode - Type directly in native script.

- Handwriting mode (currently available for Hindi only) - Write directly on your phone screen.

- Hinglish mode - If you choose “Hindi” as an input language, the English keyboard will suggest both English and Hinglish terms.

How can I enable it and set it as the default keyboard?
Open Settings
-> Language & Input, under “KEYBOARD & INPUT METHODS” section, go to Current Keyboard -> Choose Keyboards -> Check “Google Indic Keyboard” -> back to “Language & input” -> Current Keyboard -> Select “English & Indic Languages (Google Indic Keyboard)”When typing in an input box, you can also change the default input method by clicking the keyboard icon on the bottom right corner of the screen.

How to use Google Keyboard on any phone: In brief
To switch to the Google Keyboard just follow these simple steps:

Open the Google Play Store app on your phone and search for Google Keyboard.
Install Google Keyboard
Open Settings on your smartphone then in the Personal section tap on Language & Input
In the Keyboard & Input section tap on the Current Keyboard option and then select Google Keyboard from the options.
Launch any app with a text field (email, messaging, search, etc.) and the Google Keyboard should now be your default.

DOWNLOAD.....Google Indic Keyboard - .App
Pedda Balasiksha is an encyclopedia in the telugu language. suitable for children and adults. The book contains knowledge related to literature, arts, culture, morals, games, mythology, and science. The book was considered part of the academic syllabus for students until the 1960s.
Pedda Balasiksha is an encyclopedia in the telugu language. suitable for children and adults. The book contains knowledge related to literature, arts, culture, morals, games, mythology, and science. The book was considered part of the academic syllabus for students until the 1960s.      పెద్ద బాలశిక్ష  తెలుగు భాషలో ఒక విజ్ఞాన సర్వస్వం. పిల్లలు మరియు పెద్దలకు తగినది. సాహిత్యం, కళలు, సంస్కృతి, నీతులు, ఆటలు, పురాణశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఈ పుస్తకం 1960 ల వరకు విద్యార్థులకు విద్యావిషయక పాఠ్యాంశాల్లో భాగంగా పరిగణించబడింది.    Download...... Pedda balasiksha App

పెద్ద బాలశిక్ష  తెలుగు భాషలో ఒక విజ్ఞాన సర్వస్వం. పిల్లలు మరియు పెద్దలకు తగినది. సాహిత్యం, కళలు, సంస్కృతి, నీతులు, ఆటలు, పురాణశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఈ పుస్తకం 1960 ల వరకు విద్యార్థులకు విద్యావిషయక పాఠ్యాంశాల్లో భాగంగా పరిగణించబడింది.

Download...... Pedda balasiksha App


నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6,000 ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఇస్తోంది. అర్హులైన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద వచ్చే మొత్తం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. బెంగాల్, తెలంగాణ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతావి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.6,000కు మరికొంత జమ చేసి రైతు భరోసా - పీఎం కిసాన్ అని పేరు పెట్టింది.
1
మూడో విడత అమౌంట్
నరేంద్ర మోడీ సర్కార్ మూడో విడత ఫండ్స్ రైతుల అకౌంట్లలోకి వేసింది. దాదాపు అందరి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.
ఈ మూడో విడతలో 50 వేల మంది అర్హులు ఉంటే 20 వేల మంది అకౌంట్లలో మాత్రమే పడింది. ఈ స్కీం అమలు కావాలంటే ఆయా రాష్ట్రాలు లబ్ధిదారుల పేరు, వయస్సు, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ), ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు సిద్ధం చేయాలి. లబ్ధిదారులు తమ అకౌంట్లలో డబ్బులు జమ గురించిన స్టేటస్‌ను pmkisan.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
2
ఎందుకు జమ కాలేదో తెలుసుకోవచ్చు
మూడో విడతలో డబ్బు జమ కాని వారు కూడా తమ అకౌంట్లలో డబ్బులు ఎందుకు జమ కాలేదో పై వెబ్ సైట్ ద్వారా కారణాలు తెలుసుకోవచ్చు. మూడో విడతగా రూ.2,000 మొత్తం జమ కాని వారు కింది విధంగా తమ అకౌంట్లో డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకోవచ్చు.
3
ఇలా చేయండి
- తొలుత pmkisan.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- ప్రాసెస్‌లో ఉంటే కనుక త్వరలో మీ అకౌంట్లో జమ అవుతుందని చెబుతుంది.
- సబ్సిడీ ట్రాన్సుఫర్‌లో ఏదైనా సమస్య ఉంటే కనుక వెబ్ సైట్‌లో స్పష్టత ఇస్తుంది.
- ఏ సమస్య ఉందో వెబ్ సైట్ సూచించిన తర్వాత అందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
- రెండో విడతకు, మూడో విడతకు మధ్య ఈ స్కీంలో చేరిన వారికి రిజిస్ట్రేషన్, ఇతర సమస్యల కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం.
- సబ్సిడీ రాకుంటే వెబ్ సైట్‌కు వెళ్లి, పోర్టల్‌కు కుడి వైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి
- న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్, ఫెయిల్యూర్ రికార్డ్, బెనిఫిషియరీ స్టేటస్, బెనిఫిషియరీ లిస్ట్ అనే 4 ఆప్షన్లు ఉంటాయి.
- ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ ఎంచుకోండి. మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- అందులో ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో మూడో విడ డబ్బులు వచ్చాయా లేదా కూడా తెలుసుకోవచ్చు.

http://www.pmkisan.gov.in/BeneficiaryStatus/BeneficiaryStatus.aspx



అగ్రిగోల్డ్‌లో మదుపు పెట్టిన రూ.20 వేల లోపు డిపాజిట్లను చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ఇప్పటికే రూ.1,150 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ముందుగా రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబర్‌ 18న ఏపీ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. తొలి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లించాలని భావించింది.
అయితే.. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించి, వీలైనంత ఎక్కువ మంది బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ, సీఐడీ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి, బాధితులకు చెల్లించేందుకు రూ.1,150 కోట్లు కేటాయించారు.
విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు కలిసి 1995లో 'అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌' స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపించి సుమారు 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేశారు. వారికి భూములు ఇవ్వకపోగా.. చేసిన డిపాజిట్లు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన భూములను విక్రయించి, తమకు డబ్బులు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వానికి బాధితులు మొరపెట్టుకున్నారు.


భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని అర్థం. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పెళ్లైన వారు వధువు ఇంట్లో ఈ పండుగను జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి పండుగ వచ్చే సమయంలో ఒక ఊరి పేరు వార్తల్లో నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక ఊరి పేరు దీపావళి. ఈ ఊరికి దీపావళి అనే పేరు రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. పూర్వ కాలంలో గుర్రంపై వస్తున్న ఒక ముస్లిం రాజు అనారోగ్యానికి గురి కావటంతో ఒక పాడుబడిన గుడి దగ్గర పడిపోయాడు.

రాజు పడిపోయిన చోట కొందరు గ్రామస్తులు రాజుకు సేవలు చేసి రాజును కాపాడారు.

కింద పడిపోయిన సమయంలో స్పృహ కోల్పోయిన రాజుకు దీపావళి పండుగ రోజున స్పృహ వచ్చింది. రాజు సృహలోకి వచ్చిన తరువాత రక్షించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి ఆ ఊరి పేరు అడిగాడు. గ్రామస్తులు ఈ ఊరికి ఎటువంటి పేరు లేదని రాజుకు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయిన రాజు ఆ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టాడని తెలుస్తోంది.

రాజు పడిపోయిన చోట ఉన్న పాడుబడిన గుడిని కూడా సొంత ఖర్చుతో బాగు చేయించాడు. ఈ గ్రామంలో ప్రజలు ఐదు రోజులు దీపావళి పండుగ జరుపుకుంటారు. తమ ఊరికి దీపావళి అనే పేరు ఉండటాన్ని అదృష్టంగా భావిస్తామని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. తమ ఊరి పేరు దీపావళి అని ఇతరులకు చెప్పిన సమయంలో అవతలివారు ఆశ్చర్యపోతారని గ్రామస్తులు చెబుతున్నారు.


Update: Now, farmers can also check their “payment status” from the official website. the state government has updated the link of payment status of YSR Rythu Bharosa scheme on the website, to see the payment status, you will need your Aadhaar number,
YSR Raithu Barosa
How to check YSR Rythu Bharosa Payment Status?
Farmers can check YSR Rythu Bharosa Payment status by following the steps given below-
Step 2:- Click on “Payment Status” tab given on top of the page.
Step 3:- Enter Aadhaar No. and captcha code in the respective box and click on submit button.
Step 4:- Payment status will appear

http://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html


కొన్నేళ్ల వ్యవధిలోనే చైనా టెక్నాలజీ సంస్థ షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకుంది. 'చౌక ఫోన్లు, మెరుగైన ఫీచర్లు' అంటూ భారత మార్కెట్‌లో శరవేగంగా దూసుకెళ్లిన ఈ సంస్థ ప్రయాణం గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి కృతికా పతి, టెక్నాలజీ మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడారు.
'ఫ్లాష్ సేల్స్' పేరుతో నిమిషాల వ్యవధిలో అనేక ఫోన్లను ఆన్‌లైన్‌లో అమ్మేస్తోంది షియోమి. తాజాగా సోమవారం రెడ్‌మీ నోట్ 8 మోడల్ ఫోన్లు 15 నిమిషాలలోనే అమ్ముడుపోయాయి.
ఆఫ్‌లైన్ దుకాణాల్లోనూ షియోమి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్త మోడల్ ఫోన్లను తొలుత ఆన్‌లైన్‌లోనే అమ్ముతోంది ఈ సంస్థ. అందుకే, దీని అమ్మకాలలో సగానికి పైగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.
"షియోమి బ్రాండ్ ఫోన్లకు ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది" అని టెలికం పరిశోధనా సంస్థ కన్వర్జెన్స్ క్యాటలిస్ట్ భాగస్వామి జయంత్ కోళ్ల అన్నారు.
2015లో భారత మార్కెట్లో షియోమి అడుగు పెట్టినప్పుడు, ఆఫ్‌లైన్ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. తన ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో అమ్మడంపైనే దృష్టి పెట్టింది. దాంతో దుకాణాల నిర్వహణ, పంపిణీ ఖర్చులు తగ్గడంతో ఫోన్‌లు చౌక అయ్యాయి.
"ఆరంభం నుంచే ఆన్‌లైన్‌లో ఆదరణ సంపాదించడంతో దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలబడేందుకు షియోమికి సులువైంది" అని జయంత్ అంటున్నారు.
ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్, సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. ఆ సంస్థలకు ఇక్కడ 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
"పేదల ఐఫోన్"
"ఒకప్పుడు "పేదల ఐఫోన్"గా పేరు తెచ్చుకున్న షియోమికి ప్రస్తుతం భారత మార్కెట్లో 28 శాతం వాటా ఉంది. 2016లో మూడు శాతం మాత్రమే ఉండేది. ఐఫోన్‌ మాదిరి డిజైన్‌తో ఫోన్‌లను తీసుకురావడంతో షియోమి ఫోన్లకు 'పేదల ఐఫోన్' అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు ఆ సంస్థ విమర్శలు కూడా ఎదుర్కొంది" అని భార్గవ చెప్పారు.
షియోమి ఫోన్లు ఐఫోన్‌ మాదిరిగా కనిపించడమే కాదు, ఐఫోన్లలో ఉండే పలు ఫీచర్లను, హార్డ్‌వేర్‌లను కూడా అందించింది. ఐఫోన్‌ ధరలో మూడో వంతు ధరకే ఈ ఫోన్లు దొరుకుతున్నాయి. దాంతో తక్కువ ధరకే మెరుగైన ఫోన్ వస్తోందన్న భావన ఏర్పడింది.
ఉదాహరణకు రెడ్‌మి శ్రేణి ఫోన్లను చూస్తే, 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లు రూ. 9,999 నుంచి రూ.17,999 లోపే దొరుకుతున్నాయి.
"అందరూ ఐఫోన్‌ కావాలని కోరుకుంటారు, కానీ దానిని కొనేందుకు ఆర్థిక స్తోమత సరిపోదు. అప్పుడు, తమ కొనుగోలు శక్తి పెరిగే దాకా ఐఫోన్‌ను పోలిన ఇలాంటి ఫోన్లతో సరిపెట్టుకుంటారు" అని జయంత్ వివరించారు.
భారతీయ వినియోగదారులు తరచూ "ఖరీదైన స్మార్ట్‌ఫోన్"కు అప్‌గ్రేడ్ అవుతున్నారని తమ సంస్థ చేసిన పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు. చాలామంది ఆదాయం పెరిగిన వెంటనే యాపిల్ లేదా శాంసంగ్ లాంటి ఫోన్లను కొంటున్నారని తెలిపారు.
దేశీయ బ్రాండ్లకు 4జీ దెబ్బ
4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనకబడటంతో భారత స్వదేశీ మొబైల్ బ్రాండ్లు నెమ్మదిగా పతనమయ్యాయి. షియోమి వాటా పెరగడానికి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
"ఒకప్పుడు మైక్రోమాక్స్‌ లాంటి స్వదేశీ బ్రాండ్లు దేశీయ మార్కెట్‌లో ముందుండేవి. కానీ, భారత్‌లో 4జీ ప్రవేశపెట్టిన తర్వాత 2016, 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థకు చెందిన టెక్నాలజీ విశ్లేషకుడు నెయిల్ షా చెప్పారు.
"భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చే నాటికే, చైనా కంపెనీలు 4జీ సదుపాయం ఉన్న చౌక ఫోన్లను విజయవంతంగా తయారు చేయగలిగాయి. దాంతో భారత మార్కెట్‌లోకి శరవేగంగా ఆ ఫోన్లను ప్రవేశపెట్టగలిగాయి. చూస్తుండగానే అనేక మంది 3జీ నుంచి 4జీ ఫోన్లకు మారిపోయారు. ఫలితంగా భారతీయ బ్రాండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి" అని షా వివరించారు.
అయితే, భారత పోటీ మార్కెట్‌లో ఏ సంస్థ కూడా సుదీర్ఘకాలం పాటు ఆధిపత్యం కొనసాగించలేదు అన్నది వాస్తవం.
మార్కెట్‌లో 28 శాతంగా ఉన్న షియోమి వాటా గత ఏడాది నుంచి పెరగడంలేదు. కాబట్టి, దాని వేగం తగ్గిందని అర్థం చేసుకోవచ్చు.
ఇక కొరియా దిగ్గజం శాంసంగ్ కూడా దానికి దగ్గరలో 25 శాతం వాటా కలిగి ఉంది. కొత్తగా రియల్‌మి లాంటి ఇతర చైనా కంపెనీలు కూడా భారత వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
"కొన్నేళ్ల క్రితం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల వాటా మూడు నుంచి నాలుగు శాతం ఉండేది. ఇప్పుడు అది పెరిగింది" అని షియోమి ఇండియా డైరెక్టర్ మను జైన్ ఈ ఏడాది జూలైలో ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
చౌక ఫోన్లతో పాటు, ప్రీమియం మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.
కానీ, రూ.20 వేల నుంచి 30 వేల శ్రేణి షియోమి ఫోన్లు, యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పోటీ పడలేకపోతున్నాయి.
ప్రీమియం మార్కెట్‌లో యాపిల్, శాంసంగ్‌లతో పోటీ పడాలంటే అత్యాధునిక ఫీచర్లతో, కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని లేదంటే చైనా కంపెనీలు చౌక ఫోన్ల అమ్మకాలకే పరిమితం అవ్వాల్సి వస్తుందని జయంత్ అభిప్రాయపడ్డారు.


కటాఫ్ మార్కుల తగ్గింపు !
గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ప్రతిపాదనలు

గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగ నియామ కాల్లో భాగంగా బీసీ , ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించనున్నారు . దీనిపై 2 , 3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది . నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి కటాఫ్ మార్కుల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ పంప నుంది . బీసీ , ఓసీల కటాఫ్ మార్కులను 5 నుంచి 10 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని తెలుస్తోంది . ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన 47వేల పోస్టుల్లో 25 వేలవరకు భర్తీ అవుతాయని అంచనా . 126 , 728 సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన వాటి భర్తీ కోసం ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది . దీంతో ఈ కేటగిరీలోని పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు .

పది ’ విద్యార్థులకు ఉదయం టిఫిన్ . . సాయంత్రం స్నాక్స్ 

ప్రభుత్వ , జెడ్పీ స్కూళ్లలో మాత్రమే
 నవంబరు మొదటి వారంలో తుది నిర్ణయం
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత కోసం 
కర్నూల్ న్యూస్
ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులకు ఉదయం టిఫిన్ , సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ నిర్ణయించారు . హాస్టల్స్ , కస్తూర్బా , ఏపీ మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మినహా మిగిలిన ప్రభుత్వ , జెడ్పీ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు వీటిని అందించనున్నారు . ఇందుకు ఒక్కో విద్యార్థికి 20 రూపాయలు ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు . ఉదయం టిఫిన్ ఒక్కో విద్యార్థికి రూ . 15 , సాయంత్రం స్నాకకు రూ . 5గా నిర్ణయించారు . స్నాక్స్ లో రెండు ఆరటి పండ్లు కానీ , బిస్కెట్స్ కానీ ఇవ్వాలని నిర్ణయించారు . గత విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో జిల్లా 12వ స్థానంలో ఉంది . దీంతో కలెక్టర్ వీరపాండియ న్ . . విద్యాశాఖ అధికారులకు ఒక లక్ష్యం నిర్ణ యించారు . అయితే ప్రత్యేక తరగతులకు విద్యా ర్థులు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారని , ఉదయం , సాయంత్రం టిఫిన్ , స్నాక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుదని టీచర్లు సూచనలు చేయడంతో కలెక్టర్ దీనిపై స్పందించారు . టిఫిన్ , స్నాకు ప్రత్యేకంగా నిధులు - మంజూరు చేస్తామని , ఇందుకు ఒక నిర్దిష్టమైన - ప్రణాళికతో రావాలని , డీఈఓ , డీసీఈబీ అధికా రులకు సూచించారు .

75 రోజుల పాటు టిఫిన్ , స్నాక్స్ . . - 

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని యాజ మాన్యాలకు చెందిన విద్యార్థులు 45 వేల నుంచి 50 వేల మంది హాజరవుతున్నారు . వీరిలో ప్రభుత్వ , జిల్లా పరిషత్ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్ల విద్యార్థులు సుమారుగా 26 వేల మంది ఉండొచ్చని అంచనా . వీరిలో ఎఫ్ ఏ - 1 , ఎస్ఎ - 2 , స్పెషల్ టెస్ట్ ఆధారంగా వచ్చిన మార్కులను బట్టి విద్యార్థులను ఏ , బీ , సీ , డీ గ్రూప్లుగా విభజించారు . ఇందులో సీ , డీ కేటగిరిలకు చెందిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు . వంద శాతం ఫలితాల సాధన కోసం 75 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి , ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తే రూ . 3 . 90 కోట్లు ఖర్చు అవుతుందని విద్యాశాఖ అధికా రులు అంచనా వేశారు . ఈ విషయంపై నవం బరు 2వ తేదీన గానీ , నవంబర్ మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు .

చిలకలూరిపేట: గుంటూరుజిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఫోన్ కాల్ రికార్డును కమిటీ ముందు బయటపెట్టినందుకు ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ అయ్యారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్‌లో విద్యా కమిటీపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే రజిని.. హెచ్ఎం ధనలక్ష్మికి ఫోన్ చేసి ముందుగా వేసిన కమిటీని రద్దు చేయాలని హుకుం జారీ చేశారు. ఇదే విషయాన్ని హెచ్ఎం కమిటీకి తెలియజేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే తనతో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీ ముందు వినిపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రజిని సీరియస్ అయ్యారు. తన వాయిస్ రికార్డును బయటకు వినిపించడంపై హెచ్‌ఎం ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయురాలిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో హెచ్ఎం ధనలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


-సోర్స్- ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్


మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు తమకు బకాయిపడిన సుంకాలు, ఫీజుల మొత్తం రూ. 92,000 కోట్లు చెల్లించాలన్న టెలికమ్యూనికేషన్ల శాఖ అభ్యర్థనను సుప్రీంకోర్టు సమర్థించింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల ప్రభావం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లలో రెండు సంస్థలపై భారీగా పడనుంది. ఈ నిర్ణయంపై భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఈ నిర్ణయం తరువాత రెండు సంస్థల షేర్ల ధరలపైనా ప్రభావం పడింది. గురువారం భారతీ ఎయిర్‌టెల్ షేర్ల ధర 9.7 శాతం, వొడాఫోన్ ఐడియా షేర్ల ధర 23 శాతం పతనమైంది.
అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారతీ ఎయిర్‌టెల్ షేర్ ధర కోలుకుని 3 శాతం అధికంతో ముగిసింది.
వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ.28,300 కోట్ల లైసెన్సు ఫీజు బకాయి పడగా ఆ సంస్థ వద్ద నగదు నిల్వలు రూ.21 వేల కోట్లే ఉన్నాయి.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ రూ.21,600 కోట్ల మేర సుంకాలు బకాయిపడింది.
ఏజీఆర్‌పై వివాదం
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన మొత్తాలు వాటి 'అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ' (ఏజీఆర్)తో ముడిపడి ఉంటాయి. భారత్‌లో టెలికాం సంస్థలు తమ ఏజీఆర్‌లో 3 నుంచి 5 శాతం యూజర్ చార్జీలుగా.. 8 శాతం మొత్తాన్ని లైసెన్స్ ఫీజుగా చెల్లిస్తాయి.
అయితే, ఏజీఆర్‌ను ఎలా నిర్వచిస్తారనే అంశంపై భారత్‌లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వం మధ్య దశాబ్ద కాలంగా వివాదం నడుస్తోంది.
అన్ని మార్గాల్లో సాధించిన ఆదాయాన్ని ఏజీఆర్‌గా పరిగణించాలని టెలికాం డిపార్ట్‌మెంట్ అంటుండగా.. కేవలం ప్రధాన సేవలనే (కోర్ సర్వీసెస్) ప్రాతిపదికగా తీసుకుని ఏజీఆర్ లెక్కించాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కోరుతున్నారు.
మూలిగే నక్కపై తాటిపండే’
కాగా ఈ నిర్ణయం వల్ల మొబైల్ సేవల రంగంపై పెను ప్రభావం పడుతుందని భారతీ ఎయిర్‌టెల్ హెచ్చరించింది. 'మొబైల్ సేవల రంగం ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం వల్ల మరింత నష్టం కలుగుతుంది.. మొబైల్ సేవల రంగం పూర్తిగా బలహీనపడుతుంది. దీనికి బదులు ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఈ రంగంలోని సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గాలు ఆలోచించాలి'' అని భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
వొడాఫోన్ సంస్థా ఈ విషయంలో ఇలాగే ఆందోళన వ్యక్తంచేసింది. 'ఇప్పటికే పలు సంస్థలు ఈ రంగం నుంచి తప్పుకొన్నాయి. ఇలాంటి తరుణంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలపైనా భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని ఆ సంస్థ పేర్కొంది.
ఆర్థిక అంశాల నిపుణుడు వివేక్ కౌల్ దీనిపై మాట్లాడుతూ ''ఈ నిర్ణయం రెండు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాళ్లు ఈ మొత్తాలు చెల్లించడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మార్కెట్లో నిధులు పోగు చేయడం ఈ పరిస్థితుల్లో సులభం కాదు కాబట్టి ప్రధాన వాటాదారులే నిధులు సమకూర్చుకోవాలి. ఇది వినియోగదారులపైనా ప్రభావం చూపించొచ్చు'' అన్నారు.
జియోకు ఇబ్బంది లేనట్లేనా?
కాగా ఈ నిర్ణయం ప్రభావం 'జియో' మాతృసంస్థ రిలయన్స్‌పై పెద్దగా పడకపోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై పెద్దగా ఉండదన్న విశ్లేషకుల అంచనాలతో గురువారం ఆ సంస్థ షేర్ల ధరలు పెరిగాయి. జియో సేవలు 2016 నుంచి ప్రారంభం కావడంతో పోటీ సంస్థలతో పోల్చినప్పుడు రిలయన్స్‌కు బకాయిల భారం భారీగా లేదు.
మరోవైపు వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలను అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నాలపైనా ఈ నిర్ణయ ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నిధులు తగ్గిపోతాయని.. నిధులే లేనప్పుడు 5జీ బిడ్డింగ్‌‌కు వెళ్లేదెవరని విశ్లేషకులు అంటున్నారు.